Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లు అనిపించలేదు

– మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి

రాష్ట్రంలో వంట నూనెలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వినియోగదారులు వంట నూనెలు ధరలు తో చాలా ఇబ్బందులు పడుతున్నారు. నూనెలు కల్తీ జరుగుతున్నాయి…అర్ధ బస్తా సుద్ద మిగతా అర్థం బస్తా విత్తనాలు తో నూనె తీస్తున్నారు.

విజిలెన్స్ అధికారులకు విషయం తెలిసిన నిమ్మకు నీరెత్తినట్లు దారుణంగా వ్యవహరిస్తోంది.
వేరుశనగ నూనెలో ప్రొద్దుటూరు లొనే 14 మిల్లులు ఉండగా చాలా మిల్లులు కల్తీ చేస్తున్నాయి. ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిసిన మిల్లులు సంగం ఉపాధ్యక్షుడు మేనేజ్ చేస్తున్నాడు.అధికారులు వినియోగదారుల ను చంపే ప్రయత్నం చేస్తున్నారు… ఎదైనా జరగారనిది జరిగితే వారిపై హత్యాయత్నం నేను కేసు వేస్తా.

రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లు నాకు అనిపించలేదు. రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుల మంత్రి స్పందించి చర్యలు తీసుకోవాలి. ఎరువులో సుద్ద కలిపితేనే పెద్ద నేరం అలాంటిది అధికారులు మిల్లర్లను ఏమి చేయకుండా ఎందుకున్నారు. ప్రభుత్వం మనుషులను చంపే ప్రయత్నం చేస్తున్నారు.

LEAVE A RESPONSE