– సీఎం కావాలనే దాన్నో వివాదం చేస్తున్నారు
– ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి దేవీప్రసాద్
హైదరాబాద్: కౌశిక్ రెడ్డి వివాదం లో ఆంధ్ర తెలంగాణ వివాదం లేదు. సీఎం కావాలనే దాన్నో వివాదం గా చేయాలని చూస్తున్నారు. దానం నాగేందర్ ,మైనం పల్లి, గాంధీ బీ ఆర్ ఎస్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడెలా అయ్యారు? రేవంత్ ప్రోద్భలం తోనే రెచ్చిపోతున్నారు. దాడుల సంస్కృతిని కాంగ్రెస్ ఆహ్వానిస్తోందా ?
ప్రతిపక్ష నేతల పై దాడులు పెరుగుతున్నాయి. దాడుల సంస్కృతి రాష్ట్రానికి మంచిది కాదు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ను నాశనం చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు.తెలంగాణ ను ప్రేమించే వారు రేవంత్ తీరును ఖండించాలి. పదేళ్ల కేసీఆర్ పాలన లో ఇలాంటి దాడుల సంస్కృతి ఉందా ?
హరీష్ రావు ఇతర నేతల గృహ నిర్బంధాన్ని ఖండిస్తున్నాం. తెలంగాణ మేధావులు ప్రతిపక్షం మీద జరుగుతున్న దాడులను ఖండించాలి. రాష్ట్రం లో రేవంత్ రెడ్డి వ్యవస్థలను విద్వంసం చేస్తున్నారు. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కేసీఆర్ పదేళ్లు శాంతిభద్రతలను పరిరక్షించారు. రేవంత్ అందుకు విరుద్ధంగా పని చేస్తున్నారు. ప్రతిపక్షాలపై అణచివేత ధోరణి సరి కాదు. ఫిరాయింపులపై హై కోర్టు తీర్పు దృష్టి మళ్లించేందుకు, రేవంత్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇంటి పై దాడికి ప్రేరేపించారు.