ఉద్దేర హామీలతో ప్రజలను మోసం చేస్తుండు

Spread the love

బసవ కళ్యాణ్ ఎమ్మెల్యే శరణు సలగరా
కొండాపూర్ హనుమాన్ ఆలయం సందర్శన, సంగ్రామ మహారాజ్ తో భేటీ

నారాయణఖేడ్: రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోందని, ఆచరణ సాధ్యం కానీ ఉచిత హామీలిచ్చి సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తుండని కర్ణాటక రాష్ట్రం బసవ కళ్యాణ్ ఎమ్మెల్యే శరణు సలగర అన్నారు.

ప్రవాస్ యోజనలో భాగంగా ఖేడ్ లోరాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి తో కలిసి విస్తృతంగా పర్యటించారు.

సంపర్క్ సే సమర్థన్ లో భాగంగా నారాయణఖేడ్ లో ప్రముఖులు డా.రాజేశ్వర శర్మ, డా.వెంకటేశం, కాశీనాథ్ పటేల్ కు మోడీ గారి 9ఏళ్ల పాలనలో సంబంధించిన మేగజీన్ ఇచ్చారు. బిజెపి నాయకులు కిష్టయ్య మాస్టర్ ఇంట్లో భోజనం చేశారు.

కొండాపూర్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సంగ్రామ్ మహారాజ్ ఆశీస్సులు పొందారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని ఎమ్మెల్యే అన్నారు. బీఆర్ఎస్ అంటే భ్రష్ట చార్ రాష్ట్రీయ సమితిల తయారైందని అయన విమర్శించారు. కేసీఆర్ దేశంలోనే అత్యంత అవినీతికి పాల్పడిందని శరణు సలగరా విమర్శించారు. ఓటమి భయంతోనే సిట్టింగ్ లకు టిక్కెట్లు ప్రకటించారని అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప అన్నారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రజలు రాష్ట్రంలో కాషాయ జెండా ఎగుర వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సంగప్ప అన్నారు. బీఆరేస్ ఎమ్మెల్యేలు పేద ప్రజల రక్తం తగుతున్నారని జిల్లా పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఖేడ్ లో బీజేపీ పార్టీ గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి అన్నారు.

కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ డా.రవి గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ రజినీకాంత్, మారుతి రెడ్డి, సంజీవ్ పాటిల్, నగేష్ యాదవ్, సుధాకర్, పట్నం మాణిక్, రాజా గౌడ్, సతీష్, వేంకట్ రెడ్డి, వినయ్, అరుణ్, శివాజీ పాటిల్, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply