Suryaa.co.in

Andhra Pradesh

బ్యారేజీని డ్యామేజ్ చేయాలని చూశారు

– దీనిపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది
– పండగ రోజు కూడా ప్రజల కోసం పరితపిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు
-7 రోజులుగా విజయవాడలోనే ప్రభుత్వ యంత్రాంగం
– 2 రోజుల్లో సాధారణ పరిస్థితి.. యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు
– గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు
– మైన్స్ జియాలజీ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

విజయవాడ: బ్యారేజీని కూడా డ్యామేజీ చేయాలని చూశారు.దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది.దీని వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలే ప్రసక్తి లేదు. ఆ బోట్లు గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా ఉపయోగించిన బోట్లలా కనిపిస్తున్నాయి.

సర్వవిఘ్నాలు తొలగాలని విజయవాడ కలెక్టరేట్లో వినాయక చవితి నిర్వహించుకుంటున్నాం.పండగ పూట కూడా నిద్రాహారాలు మాని రాష్ట్ర ప్రజల కోసం పరితపిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు.7 రోజులుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని విజయవాడలోనే పెట్టారు.

విజయవాడ కలెక్టరేట్ నుంచే ప్రజల కోసం ప్రతి నిమిషం కష్టపడుతున్నారు.2 రోజుల్లో సాధారణ పరిస్థితి నెలకొనేలా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.ముంపు ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం, పాలు, మెడిసిన్స్ తదితర నిత్యావసరాలు సరఫరా జరుగుతున్నాయి.నిన్న ఏరియల్ సర్వే ద్వారా విజయవాడలో పరిస్థితిని సీఎం చంద్రబాబు పర్యవేక్షించారు.

కేంద్ర బృందాలు రాష్ట్రానికి వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఉత్సాహవంతంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గత ప్రభుత్వ నాయకులు పండుగను కూడా రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు తన ఇల్లు కాపాడుకోవడం కోసం ఇక్కడకు వచ్చారని విమర్శిస్తున్నారు.

విజయవాడలో ప్రస్తుత పరిస్థితులకు గత ప్రభుత్వమే కారణం.బుడమేరు గండ్ల పూచే పనులు మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులకు భగవంతుని సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నా. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల ఘటనపై అనుమానాలు కలుగుతున్నాయి.బోట్ల మీద ఉన్న రంగులు చూస్తే అనుమానాలు కలుగుతున్నాయి.

వరద బాధితులకు ఆరు రకాల నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం. బియ్యం, కందిపప్పు, మంచి నూనె ఇలా ఆరు రకాల వస్తువులు ఇస్తున్నాం. ఎవరు ఎంత నష్టపోయారనే దానిపై కూడా చర్యలు చేపట్టాం. ఇప్పటికే బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమీక్షించడం జరిగింది.

ఫైర్ ఇంజన్లతో ఇళ్లను శుభ్రం చేయడం, బ్లీచింగ్ చల్లటం వంటి తదితర శానిటేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.వరదల వల్ల నష్టపోయామనే భావన కనిపించకుండా ప్రజల కళ్ళల్లో ఆనందం కలిగించాలనే తపనతో సీఎం చంద్రబాబు తపన పడుతున్నారు.

LEAVE A RESPONSE