Suryaa.co.in

Andhra Pradesh

యువగళం పాదయాత్ర మొదలైన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారాయి

– శాసనమండలి సభ్యురాలు పంచుమర్తి అనూరాధ

యువగళం పాదయాత్ర ప్రభంజనంలా సాగుతోంది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో టీడీపీ అభ్యర్థులకు యువత పట్టం కట్టారు. యువగళం పాదయాత్ర ప్రభావంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలు నాకు ఓట్లు వేసి ఎమ్మెల్సీని చేశారు. యువగళం పాదయాత్ర మొదలైన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పంచాయతీల్లో కూడా టీడీపీ విజయాన్ని ఊహించని రీతిలో విజయం సాధించింది.

జగన్మోహన్ రెడ్డి పాలనలో గంజాయి, డ్రగ్స్, ఇసుక, ఎర్రచందనం, మట్టి, గ్రావెల్ మాఫియా పేట్రేగిపోతోంది. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. ఇలాంటి అరాచక పాలనను మట్టుబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కృష్ణాజిల్లాకు చెందిన లంబు, జంబులు భువనేశ్వరిని శాసనసభలో అవమానించారు, చంద్రబాబుతో కంటతడి పెట్టించారు. వీళ్లను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు.

LEAVE A RESPONSE