Suryaa.co.in

Andhra Pradesh

ఇది పనికిమాలిన కేసు

– ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటిషన్
– ఎక్కువ మాట్లాడితే ఫైన్ వేస్తాం
– చంద్రబాబుపై కేసు వేసిన పిటిషనర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
– మీలాంటి సీనియర్ లాయర్ ఇలాంటి కేసులు ఎలా వాదిస్తారన్న జడ్జి

ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పై వున్న సిఐడి కేసులన్నీ సిబిఐ కి బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై, న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేస్తూ, దానిని కొట్టిపారేశారు. చంద్రబాబు పై వున్న ఏడు కేసులును సిబిఐ కి బదిలీ చేయాలంటూ, హైకోర్టు న్యాయవాది, బాలయ్య వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇది పనికిమాలిన కేసు. పూర్తి స్థాయిలో తప్పుడు పిటిషన్ అని కోర్టు తప్పు పట్టింది. పిటిషన్ సంబంధించి ఒక్క మాట మాట్లాడినా, భారీగా జరిమానా విధిస్తామని కోర్టు హెచ్చరించింది.. బాలయ్య తరుపున వాదనలు విన్పించటానికి సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ సిద్ధమవుతుండ గా, ఇలాంటి పిటిషన్ ల తరపున, మీరు వాదించటమేమిటి? అని సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది..

అంతే కాకుండా, మీలాంటి సీనియర్ న్యాయవాదులు కూడా, ఇలాంటి పిటిషన్ ల తరపున హాజరవ్వుతారని, ఊహించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషన్ కు సంబంధించి ఒక మాట మాట్లాడిన, భారీగా జరిమానా విధిస్తామని కోర్టు హెచ్చరించింది.

LEAVE A RESPONSE