Suryaa.co.in

Andhra Pradesh

ఇది పేదలు.. రైతుల ప్రభుత్వం

– తిమ్మరాజుపల్లెలో సీఎం చంద్రబాబు ఇంటింటి ప్రచారం.

– సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేపట్టిన సీఎం
– నాలుగు గంటల పాటు తిమ్మరాజుపల్లెలో ఇంటింటి ప్రచారం చేపట్టిన ముఖ్యమంత్రి
– ప్రభుత్వం ఏయే వర్గాలకు ఏమేం చేస్తుందనే విషయాన్ని గ్రామస్థులకు వివరించిన ముఖ్యమంత్రి
– వడ్డెర్ల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామనే విషయాన్ని చెప్పిన చంద్రబాబు
– గనుల క్వారీయింగ్ టెండర్లల్లో వడ్డెర్లకు ఐదు శాతం కేటాయించే ఆలోచన చేస్తున్నట్టు సీఎం వెల్లడి
– ఏడాదిలో రాష్ట్రం చాలా వరకు అభివృద్ధి చెందిందని, భవిష్యత్తుపై నమ్మకం కలిగిందంటూ సీఎంకు చెప్పిన నేహా అనే ఇంటర్ విద్యార్థిని
– చంద్రబాబును మధ్య మధ్యలో ఆపుతూ.. ఫొటోలు దిగుతామంటూ కోరుతోన్న గ్రామస్థులు.. వారితో ఫొటోలు దిగిన సీఎం
– తమ ఇళ్లల్లో చంద్రబాబు ఫొటోలు పెట్టుకున్న గ్రామస్థులు
– తిమ్మరాజుపల్లెలోని గంగమ్మ గుడికి వెళ్లి దర్శనం చేసుకున్న సీఎం చంద్రబాబు.

కుప్పం: తల్లికి వందనం జయప్రదం చేశాం. ఇంటింటికి వెళ్లాను.. ప్రజలతో మాట్లాడాను. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్ ఇస్తున్నాం. త్వరలోనే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం.

కుప్పంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నాం.. పరిశ్రమలు తెస్తున్నాం. ఈ ఊళ్లోనే నేనూ ఇల్లు కట్టుకున్నాను. పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, బాధ్యత కలిగిన ప్రభుత్వమిది. ఇవాళ్టి నుంచి నెల రోజుల పాటు.. ఏడాది పాలనపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపడుతున్నాం.

ఎవరికైనా ప్రభుత్వ పథకాల అమల్లో ఏమైనా లోపాలుంటే వాటిని సరిదిద్దుతాం. బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పాం. ఎవ్వరూ ఊహించని విధంగా ఏడాదిలోనే చాలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. శ్రద్ధ, క్రమశిక్షణతో ఉన్న వారు అభివృద్ధి చేశారు.
ఈ గ్రామంలో చాలా మందికి భూములు లేవు.. బెంగళూరు వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నారు. పదివేల కుటుంబాలకు పైగా బంగారు కుటుంబాలు ఉన్నాయి. వీరికి అండగా ఉండేందుకు.. అభివృద్ధి చేసేందుకు మార్గదర్శకులను చూస్తాం.

పేదరికం నుంచి బయటకు తెచ్చేలా కార్యక్రమం చేపడుతున్నాం. ప్రభుత్వం ఎంత బాగా చేసినా.. కొన్ని సమస్యలు ఉంటాయి. ఇంత మంది సమస్యలను ఒకేసారి తీర్చాలంటే కొంత ఇబ్బంది ఉంటుంది. సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రజలూ సహకరించాలి.
ఎవరి వల్ల లాభం.. ఎవరి వల్ల నష్టం అనే విషయాన్ని ప్రజలు బేరీజు వేసుకోవాలి. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే సరిచేసుకుని పేద ప్రజల సేవకు పునరంకితం అవుతాం.

 

LEAVE A RESPONSE