Suryaa.co.in

Andhra Pradesh

దేశంపై కాంగ్రెస్ దాడి ఇదే మొదటిసారి కాదు

– రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్

విజయవాడ: రాహుల్ గాంధీ తన భారతదేశ వ్యతిరేక భావజాలాన్ని బయటపెట్టడం ఇది తొలిసారి కాదు. కాంగ్రెస్ పోరాటం బీజేపీ, ఆర్ఎస్ఎస్ మీదే కాదు యావత్తు దేశం మీద అని ఇంతకు ముందే స్పష్టం చేశారు.

మోహన్ భగవత్ మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నా, ఆ రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా లేమని చెప్పారు. రాహుల్ గాంధీ విషయాన్ని తప్పుగా వక్రీకరించి ప్రజల్ని మభ్యపెడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ హయాం నుంచి, దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా సవరణలు చేసిన విషయం యావత్తు దేశానికి తెలుసు. దేశ రాజ్యాంగ నిర్మాత బాబా సాహిబ్ అంబేద్కర్ ని కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించిందో ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు. రాహుల్ గాంధీ, మీరు ఒక్క వేలు ఇతరుల వైపు చూపిస్తే మూడు వేళ్ళు మీ తప్పును బహిర్గతం చేస్తున్నాయి.

LEAVE A RESPONSE