అనంత’ దేశం’లో ఆ ఇద్దరూ ఒకటయ్యారు!

ముఠాలు,వర్గాలు, ఫ్యాక్షన్ పాలిటిక్సుకు మారుపేరయిన అనంతపురం జిల్లాలో విడిగా ఉంటూ కొట్లాడుకోవడం కామన్. కానీ.. విడిగా ఉంటున్న వారు కలవడమే రొటీన్‌కు భిన్నం. వైఎస్ బతికున్నప్పుడు ఆయనను, జెసి దివాకర్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించేవారు. అయితే.. వైఎస్ పాదయాత్రకు ముందు జెసితో రాజీకొచ్చి, కలసి పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జెసికి మంత్రి పదవికూడా ఇచ్చారు.
కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన జెసి బ్రదర్స్‌తో, టీడీపీ సీనియర్లకు పడదన్నది బహిరంగ రహస్యమే. జిల్లాలో పాలిటిక్సు ఇలా ఉండాలంటూ జెసి టీడీపీ అధినేత చంద్రబాబుకు తరచూ చెబుతుంటారు. ఒక్కోసారి వేదికలపై బాబు మంచితనానికి ఇవి రోజులు కావని, బాబూ మీరు మారాలని హితవు పలుకుతుంటారు.
‘అనంత’ ‘దేశం’లో ఎవరి దారి వారిదే. మూడు ముఠాలతో వర్ధిల్లుతున్న అనంతపురం టీడీపీలో లోకేష్ తాజా పర్యటన.. నేతల మధ్య సఖ్యతకు వేదికగా మారింది. లోకేష్‌కు స్వాగతం చెప్పేందుకు వచ్చిన


పరిటాల శ్రీరాంను.. అక్కడే ఉన్న జెసి ప్రభాకర్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించి, వెనుక నుంచి భుజంమీద చేయి వేసి మరీ ముచ్చటించిన దృశ్యం, ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గత ఎన్నికల ముందు ఇలాగే వివిధ జిల్లాల్లో ఒకరంటే మరొకరికి పొసగని పరిస్థితిలో ఇద్దరినీ కలిపి చంద్రబాబు అందరినీ ఆశ్చర్యపరిచారు.