Suryaa.co.in

Andhra Pradesh

జెండా మోసిన చేబ్రోలు కిరణ్‌కు.. చివరకు మిగిలింది జైలా?

– కిరణ్ ఎవరికోసం…ఎందుకు చేశాడు?
– శ్రీరెడ్డి ,పంచ్ ప్రభాకర్ మాట్లాడిన బూతులు వేద మంత్రాలా?
– జెండా మోసిన వాడి చమట వాసన చూశారా ?
– మీకోసం ప్రాణాలు ఇచ్చినవారు శత్రువులయ్యారు
– అరెస్ట్ చేయండి… మళ్లీ బులుగు మూకలకు మీరే ధైర్యం ఇవ్వండి
(జీఎన్‌ఆర్)

చేబ్రోలు కిరణ్ . టీడీపీ అభిమాని, కార్యకర్త. టీడీపీ కోసం ప్రాణాలు లెక్కచేయక పోరాటం చేసిన కార్యకర్త. జగన్ సీఎంగా గా ఉన్నప్పుడు జగన్ అరాచకాలకు కౌంటర్ ఇస్తూ.. వీడియోలు పెడుతూ, టీడీపీ క్యాడర్ కు ధైర్యం ఇచ్చిన మాట వాస్తవం.

ఘర్షణ టీవీ వెంగళరావు ని నాటి ఎంపి రఘురామకృష్ణంరాజుని అరెస్ట్ చేసి ..థర్డ్ డిగ్రీ ఉపయోగించి నరకం చూపించి నప్పుడు కూడా, కిరణ్ వెనుకడుగు వేయలేదు. ఆరోజు కిరణ్ వీడియోలు మెచ్చుకున్న టీడీపీ నాయకులకు, ఈరోజు ఎందుకు నచ్చలేదు? అధికారం వచ్చింది వాళ్ళతో పని లేదనా? కిరణ్ తప్పు చేశాడా లేదా కాదు. కిరణ్ ఎవరికోసం…ఎందుకు చేశాడు?

శ్రీరెడ్డి ,పంచ్ ప్రభాకర్ మాట్లాడిన బూతులు వేద మంత్రాలు అని చెప్పా లీ అనుకొంటున్నారా? అధికారం వచ్చాక వాళ్ళను మరిచిపోయి, పార్టీ వాళ్ళ ను అరెస్ట్ చేయడం తో మీ ఇమేజ్ పెంచుకోవాలని అనుకొంటున్నారా?

వైసీపీ ప్లీనరీ లో రోజాను చంద్రబాబు ను బూతులు తిట్టు అని చెవిలో చెపితే అందరూ వినలేదా…అసెంబ్లీ లో లోకేష్ ఎవరికి పుట్టాడు అని అంటే బాబు ఏడవలేదా? అనిత ని తిట్టిన బూతులు వింటే ఏడుపు రాలేదా?

శిరీష ని ఎన్ని బూతులు తిట్టలేదు? ఇలా చెబుతూ పోతుంటే వాళ్ళ తిట్టిన బూతులు వేదాలు…టీడీపీ కార్యకర్త మాట్లాడింది మాత్రం బూతు గా అధికార కూటమి కి వినిపించిందా?

చంద్రబాబు ను లం..కా అన్న ద్వారంపూడి గాంధీ లా కనిపించాడా? అనిత ను వేశ్య గా మాట్లాడిన బులుగు బ్యాచ్ స్వాతంత్ర సమరయోధులా?

నిజంగా ఆత్మాభిమానమే ముఖ్యం పదవి కాదు అని అనిత భావిస్తే. ముందుగా మహిళ గా తనను బూతులు తిట్టిన వాళ్ళ మీద చర్యలు గురించి బాబుగారిని అడగాలి. పోలీస్ వ్యవస్త చేతిలో పెట్టుకొని తనకు తాను సహాయం చేసుకోలేని అనిత.. టీడీపీ కార్యకర్తలకు ఎలా సహాయం చేస్తారు?

అభివృద్ధి తప్ప మాకు కక్ష సాధింపు తెలియదు అని మాట్లాడుతున్న స్వయం ప్రకటిత మేధావులారా… మీకు వచ్చిన పదవులు మిమ్మల్ని అలా మాట్లాడిస్తున్నాయి.

జెండా మోసిన వాడి చమట వాసన చూశారా ? నిద్రలేని రాత్రులు…వాళ్ళ మానసిక వేదన మీకు తెలుసా? ప్రాణాలు పోగొట్టుకుంటే సానుభూతి. మీడియా ముందు తప్ప వాళ్ళకు ఒరిగింది ఏమిటి?

మిమ్మల్ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు మీ భుజాల మీద ఎక్కారు. మీకోసం ప్రాణాలు ఇచ్చినవారు శత్రువులు అయ్యారు. అరెస్ట్ చేయండి. మళ్లీ బులుగు మూకలకు మీరే ధైర్యం ఇవ్వండి. కొత్త బూతులు ఏమైనా ఉంటే తిట్టించుకొని సంబర పడండి.
పంచ్ కి ,శ్రీరెడ్డి కి టీడీపీ లో ఏదైనా మంచి పదవులు ఇవ్వండి. ఎందుకంటే మీరు గొప్పోళ్ళు . శాంతి కాముకులు. గాంధీకి వారసులు.

ఈ రోజు కిరణ్ ప్రాధేయపడటం వెనుక టీడీపీ నాయకుల ఒత్తిడి మాత్రమే కనిపిస్తుంది. కిరణ్ మీద వైసీపీ మూకల కౌంటర్ చూస్తుంటే, వాళ్ళ కంటే టీడీపీ వాళ్ళే సంబరపడిపోతున్నారు.

టీడీపీ విజయం లో కిరణ్ కష్టం లేదని మీరు భావిస్తే .. కిరణ్ తప్పులో టీడీపీ భాగస్వామ్యం ఉన్నట్లే…మీరు వెళ్ళి భారతి…జగన్ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పండి.

జై టీడీపీ

LEAVE A RESPONSE