నామినేటెడ్‌ పోస్టు పొందినవాళ్లే నా పదవికి అడ్డుపడ్డారు

– కొన్ని దుష్టశక్తులు నాకు అడ్డుపడ్డాయి
– నేను జనం చుట్టూ తిరుగుతా.. క్యాంపు ఆఫీసు చుట్టూ కాదు
– ప్రభుత్వవిప్ ఉదయభాను సంచలన వ్యాఖ్యలు

మంత్రి పదవి దక్కని ప్రభ్వు విప్ సామినేని ఉదయభాను ఆగ్రహం ఇంకా చల్లారనట్లుంది. జగ్గయ్యపేటలో ఆయన అనుచరుల నిరసన కొనసాగుతోంది. తన జిల్లాకు చెందిన నామినేటెడ్ పోస్టు పొందిన ఒక ప్రముఖడి వల్లే, తనకు మంత్రిపదవి రాకుండా పోయిందని సామినేని విరుచుకుపడ్డారు. నిన్న సామినేని చేసిన వ్యాఖ్యల ప్రకారం.. కొందరు కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులున్నారన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా తెరపైకి మాట్లాడిన సామినేని, తనకు మంత్రిపదవి రాకుండా అడ్డుపడింది రోజూ సీఎం క్యాంపు ఆఫీసు లో ఉండే ఓ నామినేటెడ్ ప్రముఖడని వెల్లడించారు.

సామినేని ఏమన్నారంటే… ప్రజల నుండి గెలవకుండా నామినేటెడ్ పోస్టులు పొందినవారు నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డారు.నాకు పదవి రాకుండా ఉండటానికి కృష్ణా జిల్లాలో కొన్ని దుష్ట శక్తుల కోటరీగా పని చేశాయి.ప్రజల్లో నాకు మంచి గుర్తింపు ఉంది. ప్రజల నుండి నేను గెలిచాను.నేనెప్పుడూ గ్రామీణ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాను క్యాంప్ ఆఫీసుల చుట్టు కాదు అందుకే దుష్టశక్తుల ఆటలు సాగాయి.ప్రజల నుండి గెలిచిన వ్యక్తులు కాకుండా నామినేటెడ్ పోస్టులు పొందిన వ్యక్తులు నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారు.నేను ఎదుగుతానని వారు ఓర్వలేకపోతున్నారు.వారెప్పుడూ సీఎం కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉంటారు. నామినేటెడ్ పోస్టులు పొంది నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డారనే అనుమానం నాకు ఉంది.