Suryaa.co.in

Telangana

వైద్య ఆరోగ్య పరిస్థితులపై ముగ్గురితో బిఆర్ఎస్ కమిటీ

– హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు రాష్ట్రంలోని పలు అసుపత్రులను సందర్శించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ
– మాజీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రాజయ్య అధ్యక్షతన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తో త్రిసభ్య కమిటీ

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన వైద్య ఆరోగ్య పరిస్థితుల పతనంపైన భారత రాష్ట్ర సమితి ఒక నిజనిర్ధారణ, అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు.

పార్టీ ఏర్పాటు చేసిన ఈ కమిటీ మాజీ ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య తో పాటు మాజీ ఎంఎల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎంఎల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఈ కమిటీలో ఉంటారు. డాక్టర్ రాజయ్య ఆధ్వర్యంలో ఈ కమిటీ గాంధీ ఆసుపత్రి తో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రులను సందర్శించి, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నిర్మాణాత్మకమైన సూచనలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

LEAVE A RESPONSE