– మీకు ఒక సిపాయి మీకు కావాలా? వద్దా?
– సీఎం రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డిగూడ కార్నర్ మీటింగ్
హైదరాబాద్: సాయంత్రం ఆరు గంటల నుంచి ఆడ బిడ్డలు పలికే స్వాగతం చూస్తుంటే నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైంది..మెజారిటీనే లెక్క. ఏనాడైనా మీ ప్రాంతానికి రంగా బిల్లా లైన బావబావమరుదులు వచ్చారా? ఇప్పుడు వచ్చి ఆటోలు ఎక్కి తిరుగుతున్నరు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది. మహిళకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారు.
అయిదేళ్లు ఆడ బిడ్డలను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. మేము సీతక్క, సురేఖ అక్కలను మంత్రులను చేశాం. వాళ్లు సొంత ఆడ బిడ్డను బయటకు వెళ్లగొట్టారు. వాళ్లు దుర్మార్గులని వాళ్ల ఆడ బిడ్డే చెబుతోంది. మీరు ఏం చేశారని ఒకడు అడుగుతుండు.
70 వేల ఉద్యోగాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి కాదా? సన్న బియ్యం ఇస్తోంది రేవంత్ రెడ్డి కాదా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మీ సమస్యల పరిష్కారానికి ఒక సిపాయి మీకు కావాలా? వద్దా? సానుభూతి అంటున్నారు… ఆ మాట మాట్లాడేవారు. పీజేఆర్ ను గుర్తుకు తెచ్చుకోవాలి. నాడు పీజీఆర్ గుండెపోటుతో చనిపోతే ప్రతిపక్ష నేత చంద్రబాబు, బీజేపీ నాయకులు పోటీ పెట్టమంటే పోటీ పెట్టిన దుర్మార్గుడు కేసీఆర్.
పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, పదేళ్లు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఏనాడైనా ఇక్కడకు వచ్చారా? నాడు బెంజ్ కార్లలో తిరిగి ఇప్పుడు రబ్బర్ చెప్పులతో ఆటోల్లో తిరుగుతున్నారు. ఇక్కడకు వస్తే పదేళ్లపాటుఏం చేశావని స్తంభానికి కట్టేసి అడగండి.
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో శ్రీగణేష్ ని గెలిపిస్తే 4 వేల కోట్ల అభివృద్ధి పనులు చెస్తున్నాడు. గతంలో మూడు సార్లు గెలిచిన వ్యక్తి ఏనాడైనా అసెంబ్లీలో మాట్లాడాడా? నగరంలో నాకో సిపాయి కావాలి. మీ అభివృద్ధికి మీకో సిపాయి కావాలి. నవీన్ కి ఒక్క అవకాశం ఇవ్వండి. అజారుద్దీన్ ని గెలిపిస్తే మంత్రిని చేస్తా అని చెప్పా. గెలిపించకపోయినా మంత్రిని చేశా.
మీరు ఒక్కరికి ఓటు వేస్తే ఇద్దరు మీకోసం పని చేస్తారు. ఎన్టీఆర్ అభిమాని కాని తెలుగు వారు ఎవరైనా ఉంటారా? అన్న గారి విగ్రహాన్ని మైత్రీవనంలో పెడతాం. విగ్రహాన్ని నేనే ఆవిష్కరిస్తా. ఈ తెలుగు సినిమా ను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లిన సినీ కార్మికులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ 400 బూత్ ల్లో మీరే రేవంత్ రెడ్డి, నవీన్ యాదవ్ లై పని చేసి గెలిపించాలి.