ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను కొట్టేయడానికే

– ఎయిడెడ్ విద్యాసంస్థలకు సంబంధించి ప్రభుత్వంఇచ్చిన జీవోలు 42, 50, 51లను తక్షణమే వెనక్కు తీసుకోవాలి.
– లేకుంటే అమ్మఒడివద్దు, మా బడి మాక్కావాలి అనే నినాదమే రాష్ట్రమంతా వినిపిస్తుంది.
– మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ
విశాఖపట్నంలో రెండు క్రిస్టియన్ మైనారిటీ ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వారితల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పాఠశా లల ఎయిడెడ్ ను రద్దుచేయవద్దంటూ ప్రభుత్వాన్నిప్రశ్నిస్తూ, నిరసన వ్యక్తంచేశారని, రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ అల్లకల్లోలమవుతోందని చెప్పడానికి విశాఖలో జరిగిన ఘటనే నిదర్శమని టీడీపీనేత, మాజీఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
విశాఖపట్నంలో జరిగినఘటనలాంటిదేకాకినాడలో కూడా జరిగింది. నేడు గుంటూరులో కూడా ఎయిడెడ్ కళాశాలలు, సిబ్బందిని కొనసాగిం చాలని ధర్నాచేశారు. ఎయిడెడ్ కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది తో పాటు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోనెం-42కి వ్యతిరేకంగా తీవ్రంగా నిరసనలు వ్యక్తంచేస్తున్నారు.
ముఖ్యమంత్రి ఏదైనానిర్ణయం తీసుకునే ముందు, ప్రజలగురించి ఆలోచిస్తే మంచిది. ఎవరో ఒక ఐఏఎస్ అధికారో, మరొకరో చెప్పారని ఎయిడెడ్ విద్యావ్యవస్థను దెబ్బతీస్తారా? ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే ఎక్కువగా నష్టపోతున్నారు. వందలఏళ్లనుంచి ఎయిడెడ్ విద్యావ్యవస్థ ను నమ్ముకొని విద్యాభ్యాసం సాగిస్తున్నవారు, దానిపై ఆధారపడి బతు కుతున్నవారు రోడ్డునపడేలా ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరించడా న్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం..
ఎయిడెడ్ విద్యావ్యవస్థ అనేద ఎందరో దాతల సహాయసహాకారాలపై ఆధారపడి నడుస్తున్న వ్యవస్థ. ఎందరో దాతలు, మహానుభావులు చేసిన విద్యాదానాన్ని అవమాన పరచేలా ప్రభుత్వం వ్యవహరిస్తే, భవిష్యత్ లో విద్యను పరిపుష్టం చేయ డానికి, విద్యారంగానికి వెన్నుదన్నుగా ఉండటానికి ఎవరైనా ముందుకొ స్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎయిడెడ్ విద్యావ్యవస్థను రూపుమాపడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, దానికి ప్రత్యామ్నాయం గా ప్రభుత్వ విద్యావిధానాన్ని తిరిగి నెలకొల్పగలదా అని తనతోపాటు, అనేకమంది మేథావులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా విశాఖ పట్నంలో వచ్చిన స్పందనను పరిగణనలోకి తీసుకుంటే మంచిదని సూచిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 2,203 ఎయిడెడ్ పాఠశాలలుంటే, వాటిలో లక్షా96వేల313 మందివిద్యను అభ్యసిస్తున్నారు. 182 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలుంటే, వాటిలో 71,035 మంది చదువు కుంటున్నారు. ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు 116వరకుఉంటే, వాటిలో 2లక్షల50వేలమంది విద్యార్థులు కొనసాగుతున్నారు. ఇంతమంది విద్యార్థుల భవిష్యత్, ముఖ్యమంత్రి నిర్ణయంతో ప్రశ్నార్థకమైంది. ఎయిడె డ్ విద్యాసంస్థలు ఎప్పుడైతే నాన్ ఎయిడెడ్ అవుతాయో, అప్పటినుంచి విద్యార్థులపై ఫీజులభారం పెరుగుతుంది, ప్రభుత్వమే ఇష్టానుసారం ఫీజులు పెంచవచ్చని చెబితే, దానివల్ల పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు నష్టం వాటిల్లదా?
అధికారంలోకి రాకముందు ముఖ్య మంత్రి ఏంచెప్పారు? కానీ ఇప్పుడేం చేస్తున్నారు? ఎయిడెడ్ విద్యాసం స్థలు పూర్తిగా నాసిరకంగా తయారయ్యాయని, వాటిలో పనిచేస్తున్న సిబ్బంది, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలేదని ముఖ్య మంత్రి చెప్పడం ముమ్మాటికీ పచ్చి అబద్ధమే. విజయవాడలోని లయోలా కళాశాల పెద్ద విశ్వవిద్యాలయంలా ఉంటుంది. అలాంటి కళా శాలలనుకూడా ప్రభుత్వం నాశనంచేయాలని చూడటంతో, విద్యార్థులు, వారితల్లిదండ్రులు రోడ్లపైకి వస్తున్నారు. చివరకు అమ్మఒడి వద్దు, మాకు మా బడి కావాలనే స్థాయికి వచ్చారు. ప్రభుత్వం ఎయిడెడ్ విద్యావ్యవస్థపై వేసిన రత్నకుమారి కమిటీ, ఏసీ గదుల్లోకూర్చొని నివేదిక ఇస్తే, ప్రభుత్వం దాన్నిఆసరాగాచేసుకొని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకుంటుందా?
ప్రభుత్వం ఏ దురుద్దేశంతో ఎయిడెడ్ విద్యాసంస్థలపై కన్నేసిందో చెప్పాలి. ప్రభుత్వం యొక్క దుష్ట ఆలోచనలు ఏమిటి? రాష్ట్రంయొక్క విద్యావ్యవస్థను ఏంచేయాలను కుంటున్నారు? శుక్రవారం సర్క్యులర్ ఇస్తే, సోమవారం నాటికి ఎయిడెడ్ విద్యాసంస్థలు, వాటియాజమాన్యాలు తమనిర్ణయం చెప్పాలా? ఎంత దుర్మార్గమండీ? కేవలం ప్రభుత్వానికి భయపడే కొన్ని ఎయిడెడ్ యాజమాన్యాలు ముందుకొచ్చాయి తప్ప, ప్రభుత్వం ఏదో ఉద్ధరిస్తుందని కాదు. ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. ప్రభుత్వం కోర్టు లకు కూడా మాయమాటలు, అబద్ధాలుచెబుతోంది. ఎయిడెడ్ యాజ మాన్యాలు స్వచ్ఛందంగానే ముందుకొచ్చాయని చెబుతారా?
ఎయిడెడ్ విద్యావిధానాన్ని నాశనంచేసి, విద్యార్థుల భవిష్యత్ ను నాశనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎవరికి మేలుజరుగుతోంది? ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను కొట్టేయాలన్న ప్రభుత్వ ఆలోచనతో అంతిమంగా నష్టపోయేదిఎవరు? ఎయిడెడ్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వమిచ్చిన జీవోనెం 42, జీవోలు 50, 51లను తక్షణమే వెనక్కుతీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం ఎంత త్వరగా ఈ నిర్ణయం తీసుకుంటే అంతమంచిది. ఒకపాలసీ, విధివిధానాలు లేకుండా తక్షణమే ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని అధ్యాపకులను ప్రభుత్వ కళాశాలల్లో నియమిస్తున్నామన్నారు.
ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు కల్పిస్తున్న ప్రయోజనాలనే ఎయిడెడ్ సిబ్బందికి ఇస్తామనిహామీఇచ్చారు. కానీ ఇప్పుడు వారిని రోడ్లపాలు చేశారు. కనీసం వారుఇన్నాళ్లనుంచి పనిచేస్తుంటే, 50శాతం సర్వీసునికూడా పరిగణనలోకి తీసుకోకుండా, వారిసర్వీసు ఇకనుంచే ప్రారంభమవుతుం దని చెప్పడం ఎయిడెడ్అధ్యాపకులను మోసగించడం కాదా? చంద్ర బాబునాయుడి హయాంలోనే ఎయిడెడ్ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ఠంచన్ గా ఒకటో తేదీనే జీతాలు తీసుకున్నారు.
కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాన్ని రూ.18వేలనుంచి రూ.37వేలకు పెంచింది టీడీపీ ప్రభుత్వం. ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వకళాశాలల్లో విలీనంచేసిన ప్రభుత్వం , అప్పటికే అక్కడున్న 750కి పైగా కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించింది. ప్రభుత్వం ఎంతత్వరగావీలైతే అంతత్వరగా మూడుజీవోలను ఉపసంహరించుకొని, రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యావ్యవస్థను కొనసాగించాలి. అలా జరగకపోతే, రాబోయేరోజుల్లో విశాఖపట్నంలో జరిగిందే 13జిల్లాల్లో జరుగుతుందని హెచ్చరిస్తున్నాం.

Leave a Reply