Suryaa.co.in

Andhra Pradesh

బాబాయిని చంపి సునీత మీద నెట్టివేసిన వాళ్ళకు…

సింగయ్య చావుమీద అబద్ధాలు చెప్పడం ఒక లెక్కా?

– వివేకా హత్య విషయంలో సీబీఐ అన్ని ఆధారాలు చూపుతుంటే..
– సునీత చంపింది అనేట్లోలకు..టైర్ల కింద తొక్కి గ్రాఫిక్స్ అనక ఏమంటారు ?
– ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలా రెడ్డి

విజయవాడ: రాష్ట్ర రాజకీయాలు దారుణంగా ఉన్నాయి.. ఉన్న పార్టీలు అన్ని మోడీ తొత్తులే…
అందరు మోడీ జపం చేస్తున్నారని ఏపీ సీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆమె గురువారం ఇక్కడి విలేఖర్లతో మాట్లాడారు. మోడీ కి యోగ మీద ఉన్న శ్రద్ధ ఆంధ్రా రాష్ట్ర ప్రజల మీద లేదు. ఆంధ్ర రాష్ట్రంలో యోగా చేస్తే తృప్తి గా ఉందంట. ఎవరు మిమ్మల్ని యోగ చేయమని చెప్పారు మోడీ? అని ఆమె ప్రశ్నించారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే.. మీరు యోగ చేసి తృప్తిగా ఉంటే సరిపోతుందా? యోగ చేసి తృప్తి పడి ఒక్క హామీ అయినా ఇచ్చారా? తృప్తి పడి ఒక్క ప్రకటన అయినా చేశారా? మీరు ఇచ్చిన హామీల మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తృప్తిగా లేరు.

ప్రత్యేక హోదా అని మోసం చేశారు. ఢిల్లీని మించిన రాజధాని కడతాం అన్నారు. ఇప్పుడు నిధులు కాదు అప్పులు ఇస్తున్నారు.. పోలవరం ఎత్తు తగ్గించి మోసం చేశారు. రాష్ట్ర బిడ్డలకు ఉద్యోగాలు లేవు. బీజేపీ మోసాల మీద బాబు, పవన్, జగన్ కనీసం స్పందన లేదు. బీజేపీ కి ఊడిగం చేస్తున్నారు. బాబు, పవన్ కూటమి కట్టి మోసం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జగన్ పెట్టుకున్నది అక్రమ పొత్తు. ప్రజా సమస్యల మీద మాట్లాడే హక్కు జగన్ కి లేదు. అయిదేళ్ళు అధికారంలో ఉండి మద్యం మాఫియా నడిపించాడు. రైతులను నట్టేట ముంచారు. రైతులు చనిపోతున్నా పట్టించుకోలేదు. వైఎస్‌ఆర్‌ పనులు ప్రారంభించిన జలయజ్ఞం ముట్టుకోలేదు. ఆరు నెలల్లో మొత్తం ప్రాజెక్ట్ లు పూర్తి అని ఒక్క దాన్ని పూర్తి చేయలేదు.

అయిదేళ్ళలో ప్రజల ఇబ్బందులు కనుక్కోలేదు. ప్రజల ముందుకు రాలేదు. కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో లేడు. ఇప్పుడు 2.0 అని మొహం చూపిస్తాడట. ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడట. జగన్ కి ప్రజా సమస్యలు కాదు..కావలసినవి బలప్రదర్శనలు. అందుకే పర్యటనల పేరుతో బలప్రదర్శనలు చేస్తున్నారు.

ఈయన చేసిన బలప్రదర్శన లకు ముగ్గురు బలి. ఈయన ప్రదర్శనలకు నిషేధం విధించాలి.

హత్యలు చేసిన వాళ్లు, చంపిన వాళ్ళు ఒప్పుకుంటారా? వివేకా బాబాయిని హత్య చేయించి సునీత మీదకు నెట్టారు. ఇప్పుడు సింగయ్య ను చంపి ఏఐ అంటున్నారు. బాబాయిని చంపి సునీత మీద నెట్టివేసిన వాళ్ళకు సింగయ్య మృతి మీద అబద్ధాలు చెప్పడం ఒక లెక్కా? వివేకా హత్య కేసులో సీబీఐ అన్ని ఆధారాలు చూపించింది. హత్య చేసిన వాళ్లు, చేయించిన వాళ్ళతో మాట్లాడిన సంభాషణలు ఉన్నాయని చెప్పింది. అయినా మేం చంపలేదు.. మాకు తెలియలేదు అని మాట మార్చలేదా? ఇది అంతే..

LEAVE A RESPONSE