జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల్లో వాళ్లు ఓటర్లు కాదు. ఆ వయసు కూడా లేదు. పదేళ్లు కూడా లేని ఆ బుడ్డాళ్లను, వైసీపీ నాయకులు ప్రచారానికి తీసుకువచ్చారు. చేతికి జెండా కర్ర ఇచ్చి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెంట తిప్పించారు. చేతిలో వైసీపీ జెండా పట్టుకుని తిరిగిన ఆ పసివాళ్లకేం తెలుసు.. తమతో ఇలా పనిచేయించడం నేరమని! కానీ వైసీపీ నేతలు మాత్రం.. నేటి బాలలే రేపటి తమ వైసీపీ కార్యకర్తలన్నట్లు, వారితో మంత్రిగారి ప్రచారం ముగిసేవరకూ జెండా కర్రలు పట్టించి వార్డుల్లో తిప్పించింది. జగ్గయ్యపేట వాసవీ మార్కెట్ వీధిలో కనిపించిన ఈ అపురూప బాలల దృశ్యం, సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇది బాలల హక్కుల కమిషన్ దృష్టికి వెళితే ఇంకేమైనా ఉందా?