– కేంద్ర రైల్వే శాఖ మంత్రి
జమ్ము-కశ్మీర్‌లో కాత్ర నుంచి బనియాల్ మార్గంలో ఉన్న చినాబ్ బ్రిడ్జిపై ట్రెయిన్ ట్రయల్స్ పూర్తి అయ్యాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి తెలిపారు. 1110ల ఫీట్ల పొడవున్న ఈ బ్రిడ్జీపై గంటకు 110 కిలోమీటర్ల వేగంతో రైలు దూసుకుపోయిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. చరిత్రలో ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉందని తెలిపారు.