నాలుగు మండలాలను నరసరావుపేట రెవెన్యు డివిజన్‌కు మార్పు

అమరావతి: జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వానికి సెగ తగిలింది. జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. గుంటూరు జిల్లాలో నాలుగు మండలాలను నరసరావుపేట రెవెన్యు డివిజన్‌కు మార్పు చేసింది. పెదకూరపాడు, అమరావతి, క్రోసూరు, అచ్చెంపేట మండలాలను నరసరావుపేట డివిజన్‌కు మార్చింది. అనంతపురం జిల్లాలో కదిరి రెవెన్యూ డివిజన్‌‎ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయింది. ధర్మవరం రెవెన్యు డివిజన్‌ రద్దు చేసింది. ధర్మవరంలో ఉన్న నాలుగు మండలాలను పుట్టపర్తి రెవెన్యు డివిజన్‌‌లో కలిపింది. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలాన్ని చిత్తూరు రెవెన్యు డివిజన్‌‌లో విలీనం చేసింది.