ప్రగతి భవన్ దగ్గర టీఆర్ఎస్ కార్యకర్త కలకలం

Spread the love

ప్రగతి భవన్ దగ్గర టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. జనగామ జిల్లా కోమరవెల్లి మండలానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త లక్ష్మణ్ నాయక్ పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్టీలో తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. లక్ష్మణ్‌ నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశానని లక్ష్మణ్ తెలిపాడు.ఈ ఘటన పార్టీ వర్గాల్లో కలకలం సృష్టించింది. టీఆర్‌ఎస్ నేత ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Leave a Reply