తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. రాష్ట్రంలో 5.09 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో అమ్మాయిలదే పైచేయిగా నిలిచింది. బాలికలు 92.45 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 87.61గా నమోదైంది.

ఇక జిల్లాల వారీగా చూస్తే… పది ఫలితాల్లో సిద్ధిపేట జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. సిద్ధిపేట జిల్లాలో 97.85 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. అటు, హైదరాబాదు జిల్లా 79.63 శాతం ఉత్తీర్ణతతో చిట్టచివరి స్థానంలో నిలిచింది. 15 పాఠశాలలు సున్నా ఫలితాలు సాధించాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఆగస్టు 1 నుంచి సప్లిమెంటరీ పరీ

Leave a Reply