జ‌ర్న‌లిస్ట్‌ పాస్ హోల్డ‌ర్స్‌కు TSRTC శుభ‌వార్త‌

హైద‌రాబాద్‌: జ‌ర్న‌లిస్ట్ పాస్‌లు ఉన్న‌వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (TSRTC) శుభ‌వార్త తెలిపింది. ఈ మేర‌కు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ( TSRTC MD VC Sajjanar ).. గుడ్ న్యూస్ ఫ‌ర్ అవ‌ర్ న్యూస్ ఫ్రెండ్స్ అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ నుంచి వ్యాలీడ్ బ‌స్‌పాస్ క‌లిగి ఉన్న జ‌ర్న‌లిస్టులు ఇక‌పై తమ టికెట్లపై రాయితీని ఆన్‌లైన్‌లోనే పొంద‌వ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు. టీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్ ద్వారా జ‌ర్న‌లిస్టులు త‌మ క‌న్సెష‌న్ టికెట్ల‌ను బుక్ చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించారు.
గ‌తంలో జ‌ర్న‌లిస్టులు త‌మ టికెట్ల‌పై రాయితీని ఆన్‌లైన్‌లో పొందే వెసులుబాటు లేదు. నేరుగా బ‌స్ కండక్ట‌ర్ నుంచి మాత్ర‌మే రాయితీ టికెట్ తీసుకునే అవ‌కాశం ఉండేది. జ‌ర్నలిస్టుల‌కు ఆన్‌లైన్‌లో టికెట్ల విష‌య‌మై స‌ల‌హా ఇచ్చిన డీ అభిన‌య్‌, ఎన్‌వీ నాగార్జున‌కు కృత‌జ్ఞ‌తలు అని స‌జ్జ‌నార్ త‌న ట్వీట్ చివ‌ర‌లో పేర్కొన్నారు.