గవర్నర్ ను కలిసిన టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరించందన్ ను తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. మంగళవారం రాజ్ భవన్ కు వచ్చిన ఆయన గవర్నర్ కు స్వామి వారి ప్రసాదం, 2022 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్, డైరీలను బహుకరించారు. కరోనా నేపధ్యంలో భక్తుల సౌకర్యార్ధం చేపట్టిన చర్యలు, ప్రస్తుతం భక్తులను అనుమతిస్తున్న విధి విధానాలను గురించి గవర్నర్ కు సబ్బారెడ్డి వివరించారు. విపత్కర పరిస్ధితుల నేపధ్యంలో భక్తుల శ్రేయస్సు దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు.