Suryaa.co.in

Andhra Pradesh

వరద బాధితులకు తులసి సీడ్స్ ఒక కోటి రూపాయల భారీ విరాళం

విజయవాడ : ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వలన సంభవించిన వరదల కారణంగా విజయవాడ నగరంలోని పల్లపు ప్రాంతాలు ముంపుకు గురై జనజీవనం స్తంభించిన విషయం అందరికీ తెలిసిందే. పరిస్ధితి చక్కదిద్దేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నప్పటికి, తమ వంతు సహాయంగా వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయనిధికి తులసి సీడ్స్ కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించింది.

తులసి సీడ్స్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు, ఆయన కుమారుడు తులసి సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ తులసి యోగిష్ కోటి రూపాయల భారీ విరాళాన్ని చెక్కు రూపంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని స్వయంగా కలిసి అందచేసారు. ఏటుకూరు మాజీ సర్పంచ్ ఉగ్గిరాల సీతారామయ్య తమ వంతు సహాయంగా రెండు లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.

అదే విధంగా తులసి గ్రూప్ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం 5,43,000/- రూపాయలను చెక్కు రూపంలో తులసి గ్రూపు సంస్థలలో ఒకటైన ‘డైహార్డ్ డైస్ ప్రైవేట్ లిమిటెడ్’ ప్రొడక్షన్ మేనేజర్ పచ్చా వాసుదేవ్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయటం జరిగింది.

2009లో కూడా కర్నూలు వరద బాధితుల సహాయార్ధం 50 లక్షల విరాళాన్ని తులసి సీడ్స్ అందజేసిందని ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు తమవంతు సహాయాన్ని అందజేయటానికి తులసి సీడ్స్ ముందుంటుందని తులసి రామచంద్ర ప్రభు తెలియజేశారు.

LEAVE A RESPONSE