తెలంగాణలో అల్ట్రా వైలెట్ రేడియేషన్

గత కొన్ని రోజులుగా విపరీతమైన వేడితో కూడిన గాలుల వలన, ప్రజలు ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రాంతంలో అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఇండెక్స్ = 12 చేరడంతో, హైదరాబాదులోని అశ్విని ఎలర్జీ సెంటర్ వైద్యబృందం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారా 2.5 కోట్లమంది, ఎలర్జీ వ్యాధితో బాధపడుతున్న వారిని దృష్టిలో ఉంచుకొని, ఒక ప్రకటన విడుదల చేసింది. అల్ట్రా వైలెట్ రేడియేషన్ index 12కు చేరడంతో, ప్రజలను ఆరోగ్య విషయంలో అప్రమత్తం చేసే విధంగా, సూచనలు విడుదల చేసింది.

అల్ట్రా వైలెట్ రేడియేషన్ index 12, ఉండడంవల్ల :
SUN ALLERGY విపరీతంగా పెరుగుతున్నాయని, ఈ ప్రభావం వల్ల శరీరమంతా విపరీతమైన మంటలు, దురదలు, ఎర్ర దద్దుర్లు, రావడం జరుగుతోందని హెచ్చరించింది.

అత్యవసర పరిస్థితులు, అనివార్య అవసరాలు మినహా, ఎట్టిపరిస్థితుల్లో ఉదయం 11 గంటల నుంచి 4pm గంటల మధ్యలో ఎండలో పోకూడదని, అశ్విని ఎలర్జీ మెడికల్ టీం చీఫ్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలిపారు.

గత పది రోజులుగా, చర్మం మీద ఎలర్జీలు తో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిందని, దీనికి కారణం సూర్యుని నుండి వెలువడుతున్న అల్ట్రావైలెట్ రేడియేషన్ మే కారణమని, అలర్జీ ఇమ్యునాలజీ వైద్యులు చెబుతున్నారు.బయటికి వెళ్ళ వలసిన పరిస్థితి ఏర్పడితే SUN PROTECTION CREAM (60spf) చర్మంపై రాసుకొని వెళ్లాలని సూచించారు.

ఫోటో డెర్మటైటిస్, POLYMORPHIC LIGHT ERUPTION వంటి సన్ ఎలర్జీలు తో బాధపడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.తలపై CAP, SUNGLASSES, LOOSE Clothing వేసుకొని బయటికి వెళ్లాలని సూచించారు.

అల్ట్రా వైలెట్ సూర్యకాంతి తాకిన అరగంట గంటలో, చర్మం దురదలు రావడం, చర్మంపై మంటలు రావడం, దద్దుర్లు రావడం, గమనించినట్లయితే వెంటనే దగ్గర్లోని అలర్జీ ఇమ్యునాలజీ స్పెషలిస్ట్ లను సంప్రదించవలసినదిగా సూచించారు.

మబ్బులు ఉన్నాయి కదా అని బయటకెళ్ళిన, ప్రమాదమని, మబ్బుల నుంచి కూడా సూర్యుని అల్ట్రా వైలెట్ రేడియేషన్ కాంతులు భూమిని తాకుతుందని, దానివల్ల కూడా అలర్జీల ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరించారు.
ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని బయటకు తీసుకు వెళ్ళకూడదని, దీనివలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

Leave a Reply