Suryaa.co.in

Andhra Pradesh

ఉషా -సుజనా పౌండేషన్ నవలల పోటీ ఫలితాలు విడుదల

ఉషా -సుజనా పౌండేషన్ నిర్వహించిన ప్రతిష్టాత్మక నవలల పోటీ ఫలితాలు ఉషా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సరస్వతి కరవది, అసోసియేట్ ఎడిటర్ కట్టా రాంబాబు సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఉషా మేనేజింగ్ ఎడిటర్ శరత్ చంద్ర మాట్లాడుతూ త్వరలో విజయవాడ లో ఉషా *బహుమతుల పండుగ*పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.

గతం లో నిర్వహించిన ఉషా -వెలగపూడి కథ-నవలల పోటీ విజేతలకు, తటవర్తి భారతీ ప్రపంచ స్థాయి కథల పోటీ విజేత లకు, ఉషా -తానికొండ కథల పోటీ విజేతలకు కూడా ఇదే వేదిక పై బహుమతుల ప్రధానం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిధులు గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు సుజనా చౌదరి,ప్రముఖ రాజకీయ వేత్త వెలగపూడి స్మారక బహుమతుల ప్రధాత వెలగపూడి గోపాల్ కృష్ణ ప్రసాద్,తటవర్తి భారతీ స్మారక పోటీల నిర్వాహకులు తటవర్తి నాగేశ్వరావు (యూ. ఎస్. ఏ )

తానికొండ నాగయ్య స్మారక పోటీ బహుమతుల ప్రదాత డాక్టర్ తానికొండ దామోదర్ పాల్గొంటారని శరత్ చంద్ర తెలిపారు.వివిధ పోటీలకు బహుమతులు స్పానర్స్ చేసిన నిర్వాహకులకు శరత్ చంద్ర ధన్యవాదాలు తెలిపారు.

సుజనా నవలల పోటీ విజేతలు వీరే
50,బహుమతి పొందిన నవలలు
1.ఊరేగింపు :సింహ ప్రసాద్
2.అముక్త మాల్యద -ఎనుగంటి వేణుగోపాల్
3.ఊరులేనోళ్ళు -సలీం
4.అవతార్ -చంద్ర శేఖర అజాద్
25,000 బహుమతి పొందిన నవలలు
1.తడి ఆరని జ్ఞపకాలు -గంటి భానుమతి
2.పక్షులు ఎగిరి పోయాయి -భాస్కర చంద్ర
3.దుఃఖ భూమి -శీరం శెట్టి కాంతారావు
4.కాల ప్రళయం -యశస్వి జవ్వాది
5.ఓ సీత కథ -ఉగాది వసంత
15,000 బహుమతి పొందిన నవలలు
1.డేంజరస్ పాషా-ఆకుండి సాయి రామ్
2.ఆగని జీవితం -రాజా రాంమోహన్ రావ్
3.ది గేమ్ -చిత్ర వెంకటేష్
4.రుద్ర భూమి -గన్నవరపు నరసింహ మూర్తి
5.క్రీటో -చొక్కాపు వెంకట రమణ
10 వేలు బహుమతి పొందిన నవలలు
1.ధర్మ సంస్థాప నార్ధాయ-మాదా ఆంజనేయులు (శేష చంద్ర )
2.అనగనగా ఒక ఊరు -నూతల పాటి వెంకట రత్న శర్మ
3.జోడీ నెంబర్ 1-మాధవి బైటారు’ దేవి తనయ ‘
4. కళంకం -హుమయూన్ సంఘీర్
5. రంగు రాళ్లు -సుధారామణ పూడిపెద్ది
6. ఏ బర్డ్ ఇన్ ది హ్యాండ్ -డాక్టర్ దారల. విజయకుమారి
7. ఓర్పుకో హద్దు -సి. హెచ్ మీనాక్షి శ్రీనివాస్
8. అధినేత -ఉరిటి సులేఖ
9. ప్రేమంటే ఏమిటీ -జస్తి రమాదేవి
10. పునః జీవన యవనిక – సురేఖ పులి

LEAVE A RESPONSE