జగనూ! నీకో దండము.. అంటున్నారు ప్రజలు

– వాలంటీర్లే ఇళ్లల్లో నాటుసారా కాస్తున్నారు
– ఇండ్లల్లోకి వెళ్లి అఘాయిత్యాలు చేస్తున్నారు
– పింఛన్ డబ్బులు తీసుకొని ప్రేయసితో జంప్ అయిపోయినందుకు వాలంటీర్లకు వందనం కార్యక్రమం పెట్టడం భేష్
-పన్నులు పెంచడంలో మంచి దిట్ట అయిన పిచ్చి తుగ్లక్ జగన్ మోహన్ రెడ్డి
-తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

గతంలో బాదుడే బాదుడు అని చెప్పి ఇప్పుడు జగను బాదుతున్నాడు. పింఛన్ డబ్బులు తీసుకొని ప్రేయసితో జంప్ అయిపోయినందుకు వాలంటీర్లకు వందనం కార్యక్రమం పెట్టడం భేష్. వాలంటీర్లే ఇళ్లల్లో నాటుసారా కాస్తున్నారు. ఇండ్లల్లోకి వెళ్లి అఘాయిత్యాలు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమలు చేస్తున్నందుకా వారికి సన్మానం. ఈ సన్మాన కార్యక్రమానికి ప్రజా ధనం రూ.250 కోట్లు కన్నం వేశారు.

. ప్రజా సంక్షేమానికి, వృద్ధులకు పెంఛన్లు ఇవ్వడానికి, ఉద్యోగాలివ్వండి, పీఆర్సీ ఇవ్వండని అడిగితే అందుకు డబ్బులు లేవంటున్నారు వైసీపీ కార్యాలయాలకు రంగులు వేయడానికి ఆదాయం రూ. 3 వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చింది? ఫ్యానుకు ఓటేసిన పాపానికి ఫ్యాన్ తిరగకుండా చేస్తున్నారు. రావాలి జగన్, కావాలి జగన్ అని పాట పాడినవారు, జై జగన్ అని నినాదాలిచ్చినవారి ఇండ్లల్లో వారి ఆడవాళ్లు తంతున్నారు. రోజు రోజుకి జగన్ లో సైకోయిజం పెరిగిపోతోంది. ప్రజల కష్టాలు తనవి కావు అన్నట్లుగా వ్యవహరించడం జగన్ కే సాధ్యం.

దిక్కుమాలిన సంక్షేమ కార్యక్రమాలకు సాక్షి పత్రికలో యాడ్ కు రూ.20 కోట్లు ఇలా వెయ్యి కోట్లు ప్రజా ధనం దుర్వినియోగం. జగన్ పాదయాత్ర సమయంలో సేవ చేసినవారికి సలహాదారు పోస్టులివ్వడం దారుణం. శ్రీ శ్రీ కాదేదీ కవితకనర్హం అన్నట్లుగా జగన్ రెడ్డి పన్నులు వేయడానికి ఏదైనా తీసుకోవచ్చని అంటున్నారు. ఆఖరుకు ఇంట్లో పెంచుకునే కుక్కలకు కూడా పన్నులు విధించినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఢిల్లీ వెళ్లి రాష్ట్ర పరిస్థితుల గురించి, రాష్ట్రానికి కంపెనీలు రావాలి అని చెప్పక.. బేల కబుర్లు, బేల ఏడుపులు, డొల్ల పనులా?

. డ్వాక్రా మహిళల రూ.2వేల కోట్లు అతని అకౌంట్లలో వేసుకోవడం దారుణం. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకి రోజు రోజుకు మానసిక క్షోభని పెంచుతున్నాడు. ఒక సైకో ఆనందాన్ని పొందుతున్న ప్రిజినరీ వ్యక్తి జగన్ రెడ్డి. సైకోసీఎం, సైకో జగన్ రెడ్డి అన్నా అతిశయోక్తిలేదు. కరెంటు చార్జీల మోత, పెట్రోల్, డీజిల్ ధరల మోత మరోవైపు నిత్యవసర వస్తువుల ధరల మోత మోగిస్తున్నారు. రైతులకు ఒక పంటకు నీరందక ఇన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జగన్ మాత్రం పైశాచికానందం పొందుతున్నాడు.

ప్రజలు అల్లాడుతుంటే మంత్రులు, కార్యకర్తల ఆనందాల గురించి ఆలోచిస్తూ వారికి విందులు ఇస్తుంటాడు. ప్రభుత్వ ’బాదుడు’కు నిరసనగా జగన్ రెడ్డికి చీపుర్లతో సన్మానాలు చేయడం ఖాయం. కొన్ని వేల కోట్లు స్క్యామ్ చేశాడు. కొన్ని వేల కోట్లకు అధిపతి. బెంగుళూరు, హైదరాబాద్, పులివెందులలో ప్యాలెస్ లు ఉన్నాయి. ఆయన ఇంటి మరమ్మత్తులకు 80 కోట్లు ప్రజాధనం కావాల్సి వచ్చింది. ప్రజల సొమ్మంటే లెక్కలేనితనం. ఇంటి పన్నులు విపరీతంగా పెంచేశారు. బాత్రూమ్ లకు కూడా పన్నులా?

నీటి పన్ను, ఇంటి పన్ను, డ్రైనేజీ పన్ను, చెత్త పన్ను, పెంపుడు జంతువుల మీద పన్ను, ఆటస్థలం పన్ను లు విధిస్తున్నారు. విజినరీ లీడర్ చంద్రబాబు చెత్త నుంచి సంపదను సృష్టించాలని వర్మీ కంపోస్టు సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇంట్లోని చెత్తను తీసుకెళ్లి కాల్చడానికి కూడా చెత్త పన్ను విధించడం అన్యాయం. ప్రజా సంక్షేమానికి, వృద్ధులకు పెంఛన్లు ఇవ్వండి, ఉద్యోగాలివ్వండి, పీఆర్సీ ఇవ్వండని అడిగితే అందుకు డబ్బులు లేవంటున్నారు.

వాలంటీర్లకు సన్మానాలు చేయడానికి మంత్రులకు విందులకు డబ్బులెలావస్తున్నాయి? శ్రీలంక సంక్షోభాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. అప్పు లేకపోతే రోజు గడవని పరిస్థితి రాష్ట్రంలో వుంది. అప్పు తెచ్చి పరిపాలన సాగిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన పంచాయతీ నిధుల్ని కూడా లాగేసుకున్నారు. పంచాయతీ నిధులు లాక్కొవడంతో పంచాయతీ ప్రెసిడెంట్ల పరిస్థితి దారుణంగా ఉంది.

జగన్ కు ప్రచారం ఫుల్ గా కావాలి, ప్రజలు పస్తులుండాలి. ఇది జగన్ అజెండా. జగన్ సైకోగా మారడమేకాదు ఊరికో సైకోని తయారు చేస్తున్నాడు. అసమర్థ పరిపాలన రాష్ట్రానికి శాపంగా మారింది. జగన్ ను తరిమి కొట్టాల్సిన అవసరముంది. మరోసారి మహిళలు రోడ్డక్కితే బాదుడే బాదుడు ఉంటుంది. జగన్ ప్రభుత్వానికి చరమ గీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

Leave a Reply