Suryaa.co.in

Andhra Pradesh

బ్యారక్ మార్చాలని వంశీ పిటిషన్

విజయవాడ: తన బ్యారక్ మార్చాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టును కోరారు. ఈ మేరకు ఆయన తరఫు లాయర్లు పిటిషన్ వేశారు. బ్యారక్ను మార్చడం కుదరకపోతే, కొందరు ఖైదీలను తన గదిలో ఉంచాలని విన్నవించారు. తనకు 6-4 సైజ్ బ్యారక్ ఇచ్చారని, అందులో మంచం కూడా పట్టడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా తనకు ఆస్తమా ఉందని, సెల్లో తనకు తోడుగా మరొకరని ఉంచాలని నిన్న జడ్జిని వంశీ కోరిన సంగతి తెలిసిందే.

LEAVE A RESPONSE