Suryaa.co.in

Andhra Pradesh

పసిగుడ్డును కాపాడలేని ఈముఖ్యమంత్రి ముమ్మాటికీ ఫెయిల్యూర్ సీఎమ్మే

– ప్రభుత్వాసుపత్రులను గాలికివదిలేసి, పేదల ప్రాణాలతో ముఖ్యమంత్రి చెలగాటమాడుతున్నాడు
– ప్రభుత్వాసుపత్రులకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారంటే, అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వఅవినీతికాదా?
పేదలకు అందాల్సిన వైద్యాన్నికూడా జగన్మోహన్ రెడ్డి వ్యాపారాంశంగా మార్చాడు.
• నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రిలో గిరిజనమహిళ లోవలక్ష్మికి వైద్యం పేరుతో జరిగిన దారుణం మరేస్త్రీకి జరగకూడదు.
• మత్తువైద్యుడు లేకుండా ప్రసవానికి వచ్చిన మహిళకు శస్త్రచికిత్స చేసి, కడుపులోని బిడ్డను సగంతీసి, తిరిగి లోపలికి నెట్టి కుట్లేశారు.
• ఆ తల్లికి కన్నపేగు బంధాన్ని, అమ్మప్రేమను దూరం చేసింది ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వంకాదా?
• చంద్రబాబునాయుడి హయాంలో అవార్డ్ పొందిన ఆసుపత్రికి, నేడు అధోగతి పట్టడానికి జగన్మోహన్ రెడ్డి విధానాలే కారణం.
• వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానీ ఏనాడైనా వైద్యఆరోగ్యశాఖపై, ఆసుపత్రుల్లోని వైద్యసేవలు, సిబ్బంది పనితీరుపై సమీక్షచేశారా?
– తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

జగన్మోహన్ రెడ్డి తాను సుప్తావస్థలో ఉంటూ, రాష్ట్రంలోని వ్యవస్థలను కూడా సుప్తావస్థలో పెట్టి, ప్రజలజీవితాలతో చెలగాటమాడుకుంటున్నాడని, ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా కూడా ప్రజలప్రాణాలంటే లెక్కలేదనే విషయం, వివేకానందరెడ్డిహత్యతోనే తేలిపోయిందని, అలాంటి వ్యక్తి సామాన్యప్రజల ప్రాణాలకు విలువఇస్తాడనిఆశించడం అత్యాశే అవుతుందని తెలుగు మహిళ రాష్ట్రఅధ్యక్షురాలు, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు శ్రీమతి వంగలపూడి అనిత తెలి పారు. గురువారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆమె మాటల్లోనే …

ప్రజలప్రాణాలతో ఆడుకుంటూ, వ్యవస్థలను నిర్వీర్యంచేస్తున్న ముఖ్యమంత్రి చర్యలను మించి న రాక్షసత్వం మరోటిఉండదు. గిరిజనులు ఇప్పటికీ సరైనవైద్యసేవలు అందక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నర్సీపట్నం ఏరియాలో లోవలక్ష్మి అనే గిరిజనమహిళ ప్రసవంకోసం ప్రభుత్వాసుపత్రికి వెళితే, చికిత్సపేరుతో అక్కడివైద్యసిబ్బంది, వైద్యులు వ్యవహరించిన ఆమెవిషయంలోవ్యవహరించినతీరు మహిళాసమాజంతో పాటు, మానవత్వం ఉన్న వారెవరైనా సరే సిగ్గుతో తలదించుకోవాల్సిందే.

పండంటి బిడ్డను ఇంటికి తీసుకెళదామని ఆ నందంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన గిరిజనమహిళకు మత్తు ఇవ్వకుండానే శస్త్రచికిత్స చేశా రు. శస్త్రచికిత్సకు అవసరమైన మందులు, వైద్యపరికరాలు లేక, బిడ్డను బయటకుతీసేక్రమం లో వైద్యులు విఫలమయ్యారు. సగంవరకు పసిగుడ్డును బయటకుతీసిన వైద్యులు, తిరిగి లోపలికి నెట్టి, కట్లువేయడంతో ఆపసిగుడ్డు కడుపులోనే చనిపోయింది.

అలాంటి పరిస్థితుల్లో నే లోవలక్ష్మిని వేరేవైద్యశాలకు వెళ్లమని అక్కడివైద్యులు చెప్పడం, తమకు సంబంధంలేదని బుకాయించడం ఈప్రభుత్వంలోనేచూస్తున్నాం. సదరు గిరిజనమహిళప్రాణాపాయస్థితిలో ఉం టే, ప్రభుత్వఆసుపత్రిలోని వైద్యులు ఆమెను కేజీహెచ్ కు వెళ్లమని ఉచితసలహాఇచ్చి, వారి

మానానవారు జారుకున్నారు. ఇంతదుర్మార్గం జరిగిన నర్సీపట్నంఆసుపత్రి ఏదైతేఉందో, దానిలోనే సరైనవైద్యపరికరాలు లేవని, ఆఖరికిముఖాలకు పెట్టుకోవడానికి మాస్కులు కూడా లేవనిచెప్పినందుకు ఈప్రభుత్వం డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిని చేసి, అతని ప్రాణాలు బలిగొన్నది.

ఆనాడు డాక్టర్ సుధాకర్ చెప్పినదానికి, నేడు లోవలక్ష్మి ప్రాణాలమీద కు వచ్చిన ఘటనకు బాధ్యతవహించాల్సింది ఈప్రభుత్వం, ముఖ్యమంత్రి కాదా? అదే నర్సీపట్నంప్రభుత్వవైద్యశాలకు 2017-18లో టీడీపీహాయాంలో ఉత్తమపనితీరు కింద అవా ర్డ్ వచ్చింది. అంతగొప్పపేరున్న వైద్యశాలలో ఇప్పుడు ఎలాంటిపరికరాలు లేవని, వైద్యులు లేవని అక్కడిసిబ్బందే చెబుతున్నారు. అలాచెప్పినందుకు ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం వారిని కూడా డాక్టర్ సుధాకర్ మాదిరే బలితీసుకుంటుందేమో?

2019కి ముందు రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులు, పీహెచ్ సీలు, సీహెచ్ సీలు, 100పడకల ఆసుపత్రుల్లో రోజుకి ఎన్నిఓపీలు నమోదయ్యేవి.. ఇప్పుడుఎన్ని నమోదవుతున్నాయో ప్రభుత్వం సమాధానంచెప్పాలి. గతప్రభుత్వంలో పేదలకు ఎలాంటిఅత్యుత్తమ వైద్యసేవలు అందేవో.. ఇప్పుడు ఎలాంటి వైద్యం అందుతోందో నేటిపాలకులు ఆత్మవిమర్శచేసుకోవాలి. ప్రతిపక్షం ఏదో అంటోంది.. ఆరోపణలు చేస్తోందనిచెప్పి, తప్పించుకునే విషయంకాదు.

పేదల ప్రాణాలు పోతున్నా, పసిగుడ్డులు తల్లుల కడు పులోనే ప్రాణాలుపోతున్నా పాలకులు పట్టించుకోకపోతే ఎలా? ఈ ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలుపెట్టినందుకు, ఆఖరికిపేదలు ఆరోగ్యశ్రీ కింద కూడా వైద్యం పొందలేకపోతున్నారు. ముఖ్యమంత్రి, ఆయన మంత్రులేమో అన్నిరకాల వైద్యసేవలను ఆరోగ్యశ్రీకిందకు తీసుకొచ్చామని, పేదలకు నాణ్య మైన, మేలైన వైద్యం అందుతోందని డబ్బాలు కొట్టుకొని బతికేస్తున్నారు. అంతాబాగుంటే ప్రజల ప్రాణాలు ఎందుకుపోతున్నాయని ప్రశ్నిస్తున్నాం.

ఆళ్లనాని వైద్యఆరోగ్యశాఖ మంత్రి అనే విషయం ఎవరికీ గుర్తులేదు. రాష్ట్రంలోని ప్రభుత్వాసు పత్రుల పనితీరు, వాటిల్లో అందుతున్న వైద్యసేవలపై ఆయన ఏనాడైనా సమీక్ష చేశాడా? కనీసం ఎక్కడైనా ఒక్కప్రభుత్వాసుపత్రిని సందర్శించి, రోగులవెతలు, వైద్యసిబ్బంది సమస్య లు తెలుసుకున్నారా? టీడీపీప్రభుత్వంలో 2014-19వరకు పీహెచ్ సీలు, సీహెచ్ సీలు, ప్రభుత్వాసుపత్రుల పనితీరుపరిశీలనకు ప్రత్యేకంగా కొందరిని నియమించారు. వారి పర్యవేక్ష ణలో ప్రభుత్వాసుపత్రుల్లోని సిబ్బంది సమయపాలన పాటించేవారు.

పేదలకు, మరీ ముఖ్యంగా మహిళలకు ఉత్తమమైన వైద్యసేవలు అందేవి. పేదలకు అత్యవసర శస్త్రచికిత్సల కోసం ప్రత్యేకంగా నిధులువిడుదలచేయడం కూడాజరిగింది. అలానే ఆసుపత్రులు అభివృద్ధికి , వైద్యపరికరాలు,ఇతరత్రా సామగ్రి కొనుగోళ్లకు సరిపడనన్ని నిధులుకేటాయించడం జరిగిం ది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక వైద్యసేవలపై పెత్తనాన్ని తిరిగి ఎమ్మెల్యేలకు అప్పగించా రు. దాంతో అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పేదలకు అందాల్సిన వైద్యసేవలను కూడా వ్యాపారాంశాలుగా మార్చుకున్నారు. దాంతో పేదలజీవితాలు, వారికి అందుతున్న వైద్యసేవ లు గాల్లో దీపాలుగా మారిపోయాయి.

నర్సీపట్నంలో లోవలక్ష్మికి జరిగిందే, రేపు మరోమహిళకుజరగదని ఈప్రభుత్వంగానీ ముఖ్యమంత్రిగానీ చెప్పగలరా? ప్రభుత్వాసుపత్రులకు వెళ్లేది అన్నెంపున్నెం ఎరుగని పేదలే కదా అన్న నిర్లక్ష్యంలో ప్రభుత్వముంది. గిరిజనమహిళలు చనిపోయినా, ఎస్సీఎస్టీలు జీవితా లు కోల్పోతున్నా ఈముఖ్యమంత్రికి చీమకుట్టినట్టుకూడా ఉండటంలేదు. ఏంజరిగినా సరే ఆయన బయటకురావడం, అధికారులు, మంత్రులను ప్రశ్నించడం జరగదు. దానిఫలితమే నిండుప్రాణాలు గాల్లోకలవడం. ప్రభుత్వాసుపత్రుల్లోని వైద్యులు, ఇతరసిబ్బందిని తాము తప్పుపట్టడం లేదు. ఈముఖ్యమంత్రి వారిని కూడా రోడ్లపాలు చేశాడు. కరోనా సమయంలో వారు ప్రాణాలకుతెగించి వైద్యసేవలు అందిస్తే, ఈముఖ్యమంత్రి వారికిసక్రమంగా జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాడు.

లోవలక్ష్మి కడుపులోనిబిడ్డ కడపులోనే చనిపోవడం ముమ్మాటికీ ఈ ముఖ్యమంత్రి వైఫల్యం , చేతగానితనమే కారణం. ప్రభుత్వాసుపత్రులకు సరైన పరికరాలు, సామగ్రి, మందులతో పాటు, వైద్యులకు, సిబ్బందికి సక్రమంగా జీతాలు అందించలేని దుస్థితిలో ఈముఖ్యమంత్రి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నిర్వాకంతో ఆఖరికి పేదలు అప్పులుచేసి ప్రైవేట్ ఆసుపత్రులకే వెళుతున్నారు గానీ, ప్రభు త్వాసుపత్రుల ముఖం చూడటంలేదు. ఆడబిడ్డకు కడుపుకోత మిగిల్చిన ఈ ముఖ్యమంత్రి ముమ్మాటికీ ఫెయిల్యూర్ సీఎమ్మే. నర్సీపట్నం ఏరియా వైద్య శాలలో మత్తువైద్యుడు లేని దుస్థితికి ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం కారణం కాదా?

రెండున్నరేళ్లలో సినీప్రముఖులు ఎవరూ ఏపీప్రభుత్వతీరుపై స్పందించలేదు. నేడు ఈ ముఖ్యమంత్రి చర్యలతో వారికి సెగతగిలింది కాబట్టే, నటుడునానీ స్పందించాడు. ఆయన స్పందించినందుకు నిజంగానే ధన్యవాదాలు. నానీతోపాటు, సినిమానటులు, ఇతరత్రా విభాగాల వారంతా స్పందిస్తేనే, ఈ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కట్టడిచేయగలం. సినిమా నటులవ్యాఖ్యలప్రభావం అన్నివర్గాలపై ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి, మంత్రులు రేపో, మాపో నటుడునానీ గారితల్లిని దూషించినా ఆశ్చర్యంలేదు. వాళ్లకు తెలిసింది అదొక్కటే కదా?

LEAVE A RESPONSE