చీఫ్ కన్జర్వేటర్ అధికారి ప్రతాప్ కుమార్ కు వర్ల రామయ్య లేఖ

కంగుండి అటవీ ప్రాంతంలో వైసీపీ నేతల అక్రమాలపై చీఫ్ కన్జర్వేటర్ అధికారి ప్రతాప్ కుమార్ కు వర్ల రామయ్య లేఖ
చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం రామకుప్పం మండలం కంగుండి అటవీ ప్రాంతంలో వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. కంగుండి అటవీ ప్రాంతంలో 15 అడుగుల వెడల్పుతో అక్రమంగా పైప్‌లైన్‌ను వేస్తున్నట్లు సమాచారం.
ఇందుకోసం కొంతమంది అధికార పార్టీ నేతలు ఎన్నో ఏళ్లుగా ఉంటున్న పెద్ద పెద్ద చెట్లను నేల కూలుస్తున్నారు. దీనిపై 2021 సెప్టెంబర్‌లో స్థానిక చిత్తూరు ప్రజలు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.ఇదే విషయాన్ని స్థానికులు తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చారు.
ఏనుగుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన కౌండిణ్య ఏనుగుల అభయారణ్యం ప్రాజెక్ట్ పలమనేరు కుప్పం అటవీ ప్రాంతంలోనే ఉన్నది.కుప్పం రేంజ్ లో ఉన్న ఫారెస్ట్ బ్లాక్‌ లలో కంగుండి అటవీ ప్రాంతం కూడా ఒకటి. నేరస్థులు, స్మగ్లర్ల నుండి కంగుండి అటవీ ప్రాంతాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది.
కావున, అటవీ (సంరక్షణ) చట్టం, 1980, వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 ప్రకారం బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోండి. భవిష్యత్తులో ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను.

వర్ల రామయ్య
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

Leave a Reply