Suryaa.co.in

Andhra Pradesh

వరద బాధితులకు కూరగాయలు, బియ్యం, ఎండుగడ్డి

– వితరణ చేయవలసిందిగా దాతలకు విజ్ఞప్తి
– టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు

ఇటీవల కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. దశాబ్దాల తరబడి సమకూర్చుకున్న సంపదంతా వరదపాలై కట్టుబట్టలతో ప్రజలు నిస్సహాయ స్థితిలో వున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసింది, మానవత్వాన్ని మరచింది. మేత లేక పశువులు నకనకలాడుతున్నాయి. కూరగాయలు, బియ్యం లేక ప్రజలు, పసి బిడ్డలు దుర్భర స్థితిలో వున్నారు. ఇళ్లల్లోకి పూర్తిగా నీరు చేరి 4 నుండి 7 రోజులు నిల్వ ఉండిపోయాయి. ఇళ్లలో బురద చేరిపోయింది. ఫ్యాన్లు, టీవీలతోపాటు ఇంటిలో వున్న అన్ని వస్తువులు పనికిరాకుండా పోయిన దృశ్యాలు నా పర్యటనలో చూశాను.

వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం బాధ్యత మరిచింది. అలాంటప్పుడు బాధితుల్ని సమాజం, మానవతావాదులు, దాతలు ఆదుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఆదుకోవాలి. ఇప్పటికే ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ కొంత మేరకు సాయం అందించింది, సాయం కొనసాగిస్తున్నది.

తక్షణం పశువులకు ఎండుగడ్డి అవసరం ఎక్కువగా వున్నది. దాతలు వారి పేరుతోగానీ, టీడీపీ ద్వారా గాని ఎండుగడ్డి వితరణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కూరగాయలు, బియ్యం కూడా అందించవలసిందిగా దాతలను కోరుతున్నాను. టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ఎన్‌ఆర్‌ఐలు కూడా ఎండుగడ్డి, కూరగాయలు, బియ్యం వితరణ చేయవలసిందిగా విజ్ఞప్తి.

LEAVE A RESPONSE