గవర్నర్లకు వెంకయ్య విందు

బుధవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసంలో.. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు గౌరవ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తేనీటి విందు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, బిశ్వభూషణ్ హరిచందన్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు పాల్గొన్నారు.