మంగళగిరి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో మాజీ ఎంపీ వి.హనుమంతరావు సమావేశమయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి విలువైన సేవలు చేసిన దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
సామాజిక ఫించన్లు రావడంలో, కార్మికులకు పలు ప్రయోజనాలు కల్పించడంలో దామోదరం సంజీవయ్య పాత్ర ఎంతో ఉందని తెలుపుతూ ఆయన పేరుతో స్మారక భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తానని పవన్ కల్యాణ్ గా తెలిపారు. ఈ సందర్భంగా హనుమంతరావుని సత్కరించి జ్ఞాపికను అందించారు.