Suryaa.co.in

Telangana

జైనూర్ ఘటనను తీవ్రంగా ఖండించిన వీహెచ్‌పి

– బాధితురాలికి కార్పొరేట్ వైద్యం అందించాలి
– నిందితులను కఠినంగా శిక్షించాలి
– దోషులకు మద్దతు పలుకుతున్న స్థానిక డిఎస్పిని సస్పెండ్ చేయాలి
– గిరిజన ప్రాంతంలో చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ముస్లింలను ఖాళీ చేయించాలి
– రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలి
– గిరిజన మహిళలపై దాడిని ఖండిస్తూ.. మానవహక్కులు, మహిళా సంఘాలు స్పందించాలి

హైదరాబాద్: సభ్య సమాజం విస్తు పోయేలా చోటు చేసుకున్న జైనూరు సంఘటనను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. ఆసిఫాబాద్ జిల్లా జైనురులో గిరిజన మహిళ ను చంపేందుకు తీవ్రంగా ప్రయత్నించిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న గిరిజన మహిళ కు మెరుగైన వైద్యం అందించేందుకు కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స చేయించాలని డిమాండ్ చేసింది.

గురువారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత రామ్మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో గిరిజనులపై దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ఓట్ల కోసం పాకులాడటం సిగ్గుచేటు అన్నారు.

చట్ట వ్యతిరేకంగా గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ముస్లింలను అక్కడి నుంచి తరిమివేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంప్రదాయాలను ధ్వంసం చేస్తూ గిరిజన మహిళలపై అత్యాచారాలు చేస్తున్న దుర్మార్గులపై కఠిన శిక్షలు విధించాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు చొరవ తీసుకొని ఈ విషయంపై బాధితురాలికి న్యాయం చేయాలన్నారు.

అత్యాచారానికి యత్నించిన ముస్లిం యువకులను బహిరంగంగా శిక్షించాలని.. మరోసారి హిందూ మహిళల వైపు చూడకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. జైనుర్ సమీపంలో ఆటోలో ఒంటరిగా వెళ్తున్న మహిళపై అత్యాచారం చేసేటందుకు ప్రయత్నించడంతో.. ప్రతిఘటించిన మహిళను చంపేయాలనే కుట్రతో బండరాళ్లతో మోదడం అత్యంత ఘోరమన్నారు.

మహిళ చనిపోయిందని భావించి, ఆమెపై ఉన్న నగలను దొంగలించి వెళ్లిపోవడం అత్యంత హేయమన్నారు. అదృష్టవశాత్తు మహిళ బతికి ఇంటికి రావడంతో విషయం వెలుగులోకి వచ్చిందని, లేదంటే మహిళా హత్య ను రోడ్డు ప్రమాదంగా చిత్రించే కుట్ర చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి ఘోరం జరుగుతున్నప్పటికీ బాధితుల ఇల్ల పైనే దాడులు చేసి, ఇల్లను తగలబెట్టడం రాక్షసత్వానికి నిదర్శనం అన్నారు. జైనురు తగలబడుతున్నప్పటికీ స్థానిక పోలీసు యంత్రాంగం నిందితులకే వత్తాసు పలికే విధంగా వ్యవహరించాయని ఆరోపించారు.

స్థానిక డిఎస్పిని వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు. 1/ 70 యాక్ట్ అమల్లో ఉన్న ప్రాంతంలో గిరిజనుల ఆస్తులను ముస్లింలు ఎలా కొంటున్నారని.. చట్టం దానిని ఏ విధంగా ఆమోదిస్తుందని విశ్వహిందూ పరిషత్ నేతలు ప్రశ్నించారు. ఆదిలాబాద్ అడవుల్లో నిరంతరం హిందువులను టార్గెట్ గా చేసుకొని దాడులు చేస్తున్నప్పటికీ పోలీసులు ఏమాత్రం స్పందించకపోవడం లేదని ఆరోపించారు.

హిందూ వ్యతిరేక చర్యలకు మద్దతు పలకడం ఏమాత్రం తగదని రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. గిరిజనులపై రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంబడే ఆ ప్రాంతం నుంచి ముస్లింలను ఖాళీ చేయించి, గిరిజన హక్కులను కాపాడాలన్నారు.
గిరిజన సంస్కృతి సంప్రదాయాలపై జరుగుతున్న దాడులను అరికట్టి గిరిజనులను రక్షించాలని వారు డిమాండ్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, రాష్ట్ర ప్రచార సహ ప్రముఖ్ రేగు అనిల్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE