లంకా సూర్యనారాయణ ఆలోచన ఉన్నతమైనది

– గుంటూరులోని అన్నమయ్య గ్రంథాలయాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి
– సందర్శకుల పుస్తకంలో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సందేశం

పుస్తకం హస్తభూషణం అన్నది పెద్దల మాట. హస్తానికి భూషణంగానే గాక మస్తకాన్ని సమాజంలో ఉన్నతంగా నిలబెట్టే శక్తి పుస్తకాలకు ఉంది. అలాంటి ఎన్నో విలువైన పుస్తకాలకు ఆలవాలమైన గుంటూరులోని శ్రీ అన్నమయ్య గ్రంథాలయాన్ని సందర్శించడం ఆనందంగా ఉంది.

గ్రంథపఠనం మీద ఆసక్తితో పాటు, చదివిన ప్రతి పుస్తకాన్ని దాచుకుని, ఆ పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేయాలన్న శ్రీ లంకా సూర్యనారాయణగారి ఆలోచన ఉన్నతమైనది. వారి చిత్తశుద్ధి
vp అభినందనీయం. ఈ పుస్తకాలన్నింటినీ గ్రంథాయలయంగా ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానాల చొరవ అభినందించదగినది.

లక్షా పాతికవేలకు పైబడి పుస్తకాలు ఒకే చోట లభించడం సాధారణ విషయం కాదు. ఎంతో మంది పరిశోధకులకు విలువైన సమాచారాన్న అందించిన ఈ గ్రంథాలయం ఫోన్ ద్వారా, ఆన్ లైన్ ద్వారా తమ సేవలను అందిస్తోందని తెలిసి ఆనందించాను. భవిష్యత్తులోనూ మరెంతో మంది ప్రజలకు ప్రయోజనకారి కాగలదని ఆకాంక్షిస్తూ… నిర్వాహకులను అభినందిస్తున్నాను.

Leave a Reply