రోశయ్య కుటుంబాన్ని పరామర్మించిన ఉపరాష్ట్రపతి

రోశయ్య కుటుంబాన్ని పరామర్మించిన ఉపరాష్ట్రపతి

హైదరాబాద్: ఇటీవల పరమపదించిన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య కుటుంబాన్ని బుధవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు.ఈ సందర్భంగా రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజకీయాల్లో కొన్ని దశాబ్ధాల పాటు వెంకయ్య నాయుడు రోశయ్యతో సన్నిహతంగా మెలిగారు. రోశయ్య వంటి సీనియర్ నేత మరణించడం రాజకీయాలకు తీరని లోటని అన్నారు.