ట్రావెల్స్ మాఫియా కోసం ఆర్టీసీ గొంతు కోయాలని చూసిన చంద్రబాబు

-విశాఖ సైన్స్ విద్యార్థుల నీటి ప్రాజెక్టు రాష్ట్రానికే గర్వకారణం
-నాడు-నేడు రెండవ దశలో రూ. 11267 కోట్లతో 25వేల స్కూళ్ల అభివృద్ధి
-స్కోచ్ మెరిట్ అవార్డుకు ఎంపికైన ఇళ్ల పట్టాల పంపిణీ రాష్ట్రానికి మరో 3.అవార్డులు
-అంబేద్కర్ ఆశయాల కోసం కలిసికట్టుగా కృషి చేయాలి
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి

ట్రావెల్స్ మాఫియా కోసం చంద్రబాబు ఆర్టీసీ గొంతు కోయాలని చూసాడని, సంస్థను బ్రతికించేందుకు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ఆర్టీసీని ఎకంగా ప్రభుత్వంలో విలీనం చేసారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. గురువారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. ఆర్టీసీ రోజుకు రూ. 3.5 కోట్లు నష్టం వస్తోందని, ధరలు పెరిగాయని డీజిల్ చెస్ వేస్తే పప్పునాయుడు (లోకేష్‌) శోకాలేంటో అర్దంకావడం లేదని, ఆర్టీసీని ఎలా నడపాలో ముఖ్యమంత్రికి బాగా తెలుసని లోకేష్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

విశాఖపట్నంకు చెందిన సైన్స్ విధ్యార్దులు రూపొందించిన నీటి గురుత్వాకర్షణ ప్రాజెక్ట్ భారతదేశం తరుఫున అంతర్జాతీయ వాటర్ కాంగ్రెస్ కు ఎంపిక కావడం నగర వాసులతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. ప్రస్తుత నీటి కొరత సమయంలో నీటిని కాపాడుకోవడమంటే ప్రాణాలను కాపాడుకోవడమేనని అన్నారు. దేశం గర్వించదగ్గ ప్రాజెక్టును రూపొందించిన యువ మేధావులను శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు సమూలంగా మార్చేసే సంకల్పంతో సీఎం జగన్ మన బడి నాడు నేడు పథకం అమలు చేస్తున్నారని అన్నారు. మొదటి దశ పనులు విజయవంతంగా పూర్తవ్వడంతో పలు ప్రభుత్వ స్కూళ్లలో అనేక రకాల మౌలిక వసతులు సమకూరాయని అన్నారు. రెండో దశ పనుల్లోనూ గణనీయమైన మార్పులు కనిపించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారని అన్నారు.

రెండో దశలో మనబడి నాడు నేడు కార్యక్రమంలో బాగంగా రూ.11,267 కోట్లతో 25 వేల స్కూళ్లలో మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారని అన్నారు. మొదటి దశలో రూ.3,698 కోట్లతో 15,715 స్కూళ్లలో వసతులు కల్పించడం జరిగిందని అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతిని అంగ్లమాద్యమంలోకి మార్చనున్నారని అన్నారు. ప్రతి మండలంలో బాల, బాలికలకు వేర్వేరు కాలేజీలు ఏర్పాటు చేయనున్నారని, పాఠశాలలు తెరిచే నాటికి రూ.960 కోట్లతో విద్యా కానుక అందించనున్నారని అన్నారు.

విద్యా రంగ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ సీఎం జగన్ అనేక సంస్కరణలు చేపట్టారని. రాష్ట్రంలో పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ఏర్పాటు చేస్తున్న ఆరు రకాల పాఠశాలల (శాటిలైట్, ఫౌండేషన్, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్)ఏర్పాట్లు వచ్చే జులై నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారని అన్నారు. 2024 జూలై నాటికి ఈ పాఠశాలల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాల పథకాల్లో భాగంగా సొంతిళ్లు లేని 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఒకేసారి ఇళ్ల పట్టాలను ఉచితంగా పంపిణీ చేసిందని. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఈ ప్రక్రియ పలు ప్రశంసలందుకోవడమేకాక ఎకంగా స్కోచ్ మెరిట్ అవార్డు పొందిందని అన్నారు. .పారదర్శక పంపిణీకి మెరిట్ అవార్డు తో పాటు మరో 3 అవార్డులు మన రాష్ట్రానికే దక్కాయని అన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నా ఇక్కడి జాతి మీడియా మాత్రం విమర్శలు మానడం లేదని అన్నారు.

భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశ ప్రజలందరి స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం కోసం కలలు కన్నారని. గురువారం ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆ గొప్ప దార్శనికుడిని స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధన కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

Leave a Reply