– కేంద్ర ఇంధనశాఖకు గనుల శాఖ లేఖ
న్యూఢిల్లీ: ఏపీలో పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా మైనింగ్ జరుగుతోందని కేంద్ర గనులశాఖ పేర్కొంది. ఏపీలో మైనింగ్ చట్టాల ఉల్లంఘన కూడా జరుగుతోందని తెలిపింది. ఏపీలో బీచ్ శాండింగ్ మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని కేంద్ర ఇంధనశాఖకు గనులశాఖ లేఖ రాసింది.
మోనాజైట్ ఖనిజాన్ని రహస్యంగా ఎగుమతి చేస్తున్నట్లు గనులశాఖ ఫిర్యాదు చేసింది.దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఏపీకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీలు ఆదాల, గోరంట్ల మాధవ్ ప్రశ్నకు ప్రధాని కార్యాలయం సహాయమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ సమాధానం ఇచ్చారు.