అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11వేల 440 కోట్ల రూపాయలతో ప్యాకేజీని ప్రకటించింది కేంద్ర ప్రభు త్వం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రకటన చేశారు.
రూ.11,440 కోట్లతో ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు అశ్వి ని వైష్ణవ్ వెల్లడించారు. వి శాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆకాంక్షలకు అనుగు ణంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు భారీ ప్యాకేజీ ప్రకటించింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీ కరణ చేయొద్దని కొన్నేళ్లుగా కార్మికుల ఉద్యమాలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దని కార్మిక సంఘాలు గత కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు భారీ ప్యాకేజీ ప్రకటించాలని ఎప్పటి నుంచో కోరుతున్నాయి.
అటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు సైతం ఉక్కు పరిశ్రమ పరిరక్షణ లక్ష్యంగా పోరాటాలు చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై అనేక అనుమానాలు, భయాలు నెలకొన్న వేళ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. స్టీల్ ప్లాంట్ కు భారీ ప్యాకేజీ అనౌన్స్ చేసింది.
నష్టాల్లో ఉన్న ప్లాంట్ గట్టెక్కేందుకు ఉపయోగ పడనున్న ఆర్థిక ప్యాకేజీ.. ఆర్థిక కష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కిం చేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవు తోంది.నష్టాల్లో ఉన్న ఉక్కు పరి శ్రమకు ఈ ప్యాకేజీ కొత్త ఊపిరి అందించనుందని కార్మిక సంఘాలు అభిప్రా యపడ్డాయి. స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం ఆర్థిక ప్యాకేజీని కేంద్రం అధికారికంగా ప్రకటించింది.