లోకేష్ బెంగళూరు/ కర్ణాటక పొలిటిషన్స్ తో పంచాయతి పెట్టుకోవటం కొంత మందికి నచ్చటం లేదు. ఇది మన తెలుగు వాళ్ల బేసిక్ నేచర్, మనం అందరితో బాగుండాలి అనుకుంటాము, అవతల వాళ్ళకి మన పట్ల అదే భావన ఉందా లేదా అనే సంగతి పట్టించుకోము లోకేష్ బెంగుళూరు మీద క్లాసిక్ “David versus Goliath” marketing strategy వాడుతున్నాడు
David versus Goliath అనేది బైబిల్ లో story, 9 అడుగుల 9 అంగుళాల goliath ని 5 అడుగుల 16 సంవత్సరాల బాలుడు తెలివి తేటలతో మట్టి కరిపిస్తాడు
నిజం చెప్పాలి అంటే బెంగళూరు విశాఖతో పోలిస్తే నిజంగా Goliath. విశాఖ ఏ విషయంలో బెంగళూరు తో పోటీ పడలేదు
“David versus Goliath” marketing strategy ని చిన్న కంపెనీలు పెద్ద కంపెనీలు ని ఫేస్ చేసినప్పుడు వాడతాయి , Apple vs IBM, Nike Vs Adidas, Pepsi Vs Coke ఇవి క్లాసికల్ ఎగ్జాంపుల్స్
పెద్ద కంపెనీలు bureaucratic గా, స్లో గా, వాటి size వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటాయి (బెంగుళూరు లాగా).. అదే చిన్న కంపెనీలు ఫాస్ట్ గా agile గా ఉంటాయి (విశాఖ లాగా)- పబ్లిక్ సింపతీ కూడా వాటి వైపే ఉంటాయి
పెద్ద వాడితో చిన్న వాడు పోటీ పడితే, పబ్లిక్ చాలా interest తో చూస్తారు. వాళ్ళ సింపతి కూడా చిన్న వాడి వైపే ఉంటుంది
లోకేష్ క్రియేట్ చేసిన బెంగళూరు వెర్సస్ విశాఖ battle ని దేశం మొత్తం interest తో చూస్తుంది, మెజారిటీ విశాఖ ని చీర్ చేస్తున్నారు
దీని వల్ల విశాఖ కి విపరీతమైన traction వచ్చింది, లోకేష్ కి కావాల్సింది అదే.
డేవిడ్ (విశాఖ) ని represent చేస్తున్న లోకేష్ కి nationwide educated లో craze పెరిగింది
గూగుల్ విశాఖకి వచ్చే సరికి ఈ యుద్ధంలో విశాఖ గెలుస్తుంది అనే మెసేజ్ వెళ్లింది.
మన తెలుగు వాళ్ళకి మొహమాటం ఎక్కువ, for a change లోకేష్ ఆ మొహమాటం పక్కన పెట్టి బెంగుళూరు లాంటి Goliath ని Head On ఫేస్ చేస్తున్నాడు.