Suryaa.co.in

Features

వక్ఫ్ సవరణ బిల్లు.. సంతోషం.. సంతోషం..సంతోషం!

స్వతంత్ర భారతదేశంలో ఒక అత్యున్నతమైన మేలు జరిగింది! పా(ర్)లమంట్ ఏర్పడిన తరువాత ఆ పా(ర్)లమంట్ నుంచి దేశానికి పెనుశుభం జరిగింది!!
వక్ఫ్ సవరణ బిల్ పా(ర్)లమంట్ లో నెరవేరింది!!!

గత వెయ్యేళ్లలో భారతంలో ఈ స్థాయిలో ‘మట్టికి మహోపకారం’ జరగడం ఇదే ప్రథమం. చొరబడ్డ విదేశీ మతం శతాబ్దుల తరబడి స్వదేశాన్ని తింటూనే ఉంది; విధ్వంసక విదేశీ మతం ఈ దేశంలోని పెద్ద శాతం ప్రజను బాధిస్తూనే, వేధిస్తూనే ఉంది.

దేశాన్ని, దేశంలోని పెద్దశాతం ప్రజ ఐన హిందువుల్ని దక్కించుకునే, నిలబెట్టుకునే ప్రయత్నంలో ఒక పెనువిజయంగా వక్ఫ్ సవరణ బిల్ దేశ పా(ర్)లమంట్ ఆమోదాన్ని పొందింది.

సంతోషం; సంతోషం; సంతోషం

ఇది దేశ పా(ర్)లమంట్ చట్టం. దీన్ని ఆమోదించని, అంగీకరించని, ఆస్వాదించని దుష్ట శక్తులు దేశ ద్రోహులే! దేశ పా(ర్)లమంట్ ను గౌరవించని నీచ శక్తులు దేశ ద్రోహులే!! దేశంలోని ప్రతి పౌరుడూ దేశ చట్టానికి బద్ధుడవాల్సిందే. కాదంటే దేశ పౌరసత్వాన్ని వదులుకోవాల్సిందే.

బ్రిటీష్ కాలంలో దేశ ప్రగతిని, సౌభాగ్యాన్ని, హిందువుల భద్రతను దెబ్బతీసే కుట్రగా రూపొందిన వక్ఫ్, కాంగ్రెస్ పాలనలో హిందువులకు పెనుహానిగా బలపడిన వక్ఫ్ ఇదిగో ఇప్పటికి పా(ర్)లమంట్ ద్వారా నిర్వీర్యమైంది; అందువల్ల దేశానికి, హిందువులకు ఉపశమనం కలిగింది. ఈ చారిత్రిక ఘట్టాన్ని సాకారం చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ, గృహమంత్రి అమిత్ షా ఇద్దరికీ కృతజ్ఞత; కృతజ్ఞత; కృతజ్ఞత. దేశ ప్రజలందరూ ఈ ఇద్దరికీ కృతజ్ఞత తెలియజేస్తూనే ఉండాలి.

నరేంద్ర మోదీ, అమిత్ షా ఈ ఇరువురి దక్షత, నేర్పు, మేధ, కార్యశీలత వీటివల్లే ఈ మంగళకర పరిణామం సాకారమైంది. ఈ బిల్లుకు అనుకూలంగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకు కూడా దేశ ప్రజ ధన్యవాదం తెలపాలి. దేశంలో హిందు-ఓటు ఏకీకృతం అవడం వల్ల గెలిచిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ హిందువుల ప్రయోజనార్థం, దేశ రక్షణార్థం ఈ చారిత్రిక ఘట్టంలో సరైన, బాధ్యతాయుతమైన పాత్ర పోషించారు. అందుకు ఆయనకు అభినందనలు. ఈ బిల్ ను సమర్థిస్తున్న ప్రతి ప్రజాప్రతినిధికీ ధన్యవాదం.

ఈ దేశంలోని పెద్దశాతం ప్రజలు హిందువులు. ప్రజాస్వామ్య ప్రమాణాల ప్రకారంగా హిందువుల అభీష్టమే ఆచరణలోనూ, అమలులోనూ ఉండాలి. హిందువులకు వ్యతిరేకమైంది ఏదీ దేశానికి అక్కర్లేదు; పనికిరాదు!

‘విదేశీ మత సంతుష్టీకరణ’ ఇది కొందరు రాజకీయ నాయకుల నపుంసకత్వం. మనదేశానికి నపుంసక రాజకీయాలు వద్దొద్దు. దమ్మున్న రాజకీయ నాయకులే కావాలి. ఇకపై దేశానికి హిందూ సంతుష్టీకరణ మాత్రమే కావాలి. హిందూ సంతుష్టీకరణతో సరైన, ఉన్నతమైన రాజకీయం, దేశ అవసరాలను తీర్చగలిగే రాజకీయం ఇకపై దేశంలో రాణించాలి.

దేశానికి అత్యవసరమైన ఈ బిల్లుకు వ్యతిరేకంగా కొందరు పా(ర్)లమంట్ సభ్యులు ఓటు వేశారు. దారుణం ఇది అతి దారుణం. ప్రజా ప్రతినిధులై కూడా పెద్దశాతం ప్రజలైన హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్లకు శిక్ష ఏమిటి? హిందువులారా ఆలోచించండి; సరిగ్గా కదలండి దేశ ద్రోహులను తప్పకుండా శిక్షించండి. ప్రజలారా విదేశీ మతోన్మాదాన్ని నిర్మూలించండి.

దేశ అభివృద్ధికి, దేశ సార్వభౌమత్వానికి, దేశ భద్రతకు, హిందువుల సంక్షేమానికి వక్ఫ్ సవరణ బిల్ నెరవేరడం అన్నది కీలకం. ఇలాంటివి ఇంకొన్నీ జరగాల్సి ఉన్నాయి. కాలక్రమంలో ఒకటొకటిగా మనకు జరగాల్సిన మేళ్లు జరిగి తీరాలి. అందుకు విదేశీ మత వాద శక్తులు, మాఫియాలు, కమ్యూనిస్టులు, హింసా వాదులు, మేధావులు, హిందూ ద్రోహులు కాదు, కాదు, కాదు బీ.జే.పీ. ఆపై ఆర్.ఎస్.ఎస్. మాత్రమే కావాలి.
హిందువులారా భారతదేశం మనది; భారతదేశాన్ని నిలబెట్టుకుందాం. హిందువులారా ఏకీకృతమౌదాం రా రండి. భారతదేశం సదా, శతధా, సర్వదా, సర్వథా విలసిల్లుతూండాలి.

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE