– విద్యా సంస్థలు కాబట్టి అకడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం
– ఓవైసీ కాలేజ్ విషయంలో ఒకడుగు వెనక్కి వేసిన హైడ్రా
– హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్: చాంద్రాయణ గుట్ట సలకం చెరువు లోని ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అక్రమ కట్టడాలు తొలగించేందుకు సమయం ఇస్తున్నాం. విద్యా సంస్థలు కాబట్టి అకడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం. విద్యార్థులు రోడ్డున పడ కూడదని మాత్రమే ఆలోచిస్తున్నాం. వాళ్లకు వాళ్లుగా తొలగించక పోతే హైడ్రానే చర్యలు తీసుకుంటుంది. ఒవైసీ అయినా, మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్.