తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం
ఆర్యవైశ్య సేవా సంస్థల నిర్వహణ పై వైశ్యులకే పూర్తి హక్కులు
కల్పిస్తూ మంత్రి వర్గంలో తీర్మానం
వైకాపా ప్రభుత్వంలోనే అర్యవైశ్యుల చిరకాల కోరిక సాకారం రాష్ట్ర మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడి
తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్యవైశ్యుల అభివృద్ధి, సంక్షేమానికి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర మాజీ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఆర్యవైశ్యుల చిరకాల కోరిక అయినటువంటి ఆర్యవైశ్య సేవా సంస్థలను వైశు కలే నిర్వహించేలా మంత్రి వర్గంలో తీర్మానం చేయడం ఎంతో సుభపరిణామమని శుక్రవారం పత్రికా ప్రటకన ద్వారా హర్షం వ్యక్తం చేశారు. పూర్వం ఆర్యవైశ్య పెద్దలు వారి సొంత ఆస్తులు రాష్ట్ర వ్యాప్తంగా విరాళంగా ఇచ్చిన వేలకోట్ల ఆస్తులు, శ్రీ వాసవి మాత ఆలయాలు కాలక్రమంలో దేవాదాయ శాఖలో విలీనం చేయబడినాయన్నారు.
నాడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చొరవతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వైశ్యుల మీద ఉండేటటువంటి అపారమైన ప్రేమ, గౌరవంతో శ్రీ వాసవి మాత ఆలయాలను వైశ్యులే సొంతగా నిర్వహించుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. నాటి నుండి వాసవి మాత ఆలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెంది విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. దానిని ఆదర్శంగా తీసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్యవైశ్యులకు దిశా నిర్దేశం చేస్తూ అన్నీ రంగాల్లో అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి పెద్ద పీట వేశారన్నారు. ఆర్యవైశ్యుల ఆస్తులైన ఆర్యవైశ్య సత్రాలు, కళ్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్స్ స్టు, ఆర్యవైశ్య సంఘాలకు చెందిన ఇతర ఆస్తులు అన్నింటి పైన పూర్తి అధికారం అర్యవైశ్యలకే చెందేటట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మక మైనదన్నారు. ఆర్యవైశ్యులకు ఎంతో ఆనందాన్ని కల్గించే నిర్ణయాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆర్యవైశ్య సమాజం తరుపున కృతాజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు.