స్థానికంగానే అన్ని రకాల వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం

– గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)
గుడివాడ, నవంబర్ 8: స్థానికంగానే అన్నిరకాల వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిని బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి మంత్రి కొడాలి నాని సందర్శించారు. ఈ సందర్భంగా చైల్డ్ ఫండ్స్ సంస్థ రూ.25 లక్షల వ్యయంతో గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి పీడియాట్రిక్ వార్డుకు సమకూర్చిన అధునాతన వైద్య పరికరాలను ప్రారంభించడం జరిగింది.
అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రూ. 10.70 కోట్ల వ్యయంతో నూతన భవనాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అదమా ఆక్సిజన్ ప్లాంట్ ను నెలకొల్పామని తెలిపారు. రూ.రెండు కోట్లతో మరో ఆక్సిజన్ ప్లాంట్ ను త్వరలో ప్రారంభిస్తున్నామని చెప్పారు. వృద్ధుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో జెరియాట్రిక్ వార్డును నిర్వహిస్తున్నామని, నిర్మాణ పనులు పూర్తి కానున్నాయని మంత్రి కొడాలి నాని చెప్పారు. బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రిలోని పీడియాట్రిక్ వార్డుకు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చిన చైల్డ్ ఫండ్స్ సంస్థను అభినందించారు. ముందుగా మంత్రి కొడాలి నానికి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరాదేవి పుష్పగుచ్చం అందజేశారు. బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరిని దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవి నారాయణ రెడ్డి, ఆస్పత్రి వైద్యులు డాక్టర్ మల్లేశ్వరి, డాక్టర్ విద్యాధరి, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ యాదిద్య, డాక్టర్ మాధురి, వైసిపి రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవి నారాయణరెడ్డి, నాయకులు మట్టా జాన్ విక్టర్, పెయ్యల ఆదాం, కందుల దుర్గా కుమారి, మేకల సత్యనారాయణ, మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి, ఎస్కే బాజీ, కంచర్ల జగన్, తోట రాజేష్, గంటా చంద్రశేఖర్, దారం నరసింహ, కందుల నాగరాజు, అంగడాల వేణు, రహమతుల్లా, సయ్యద్ గఫార్, మూడెడ్ల ఉమా, మెండా చంద్రపాల్, అబ్బూరి భాస్కరరావు, గోళ్ళ రామకృష్ణ, మాదాసు వెంకట లక్ష్మి కుమారి, కొర్నిపాటి గణపతి, సత్య దుర్గాప్రసాద్, రేమల్లి పసి, అగస్త్య రాజు కృష్ణమోహన్, అల్లం సూర్యప్రభ, అల్లం రామ్మోహన్, రంగా, వెంపటి సైమన్, మామిళ్ళ ఎలీషా, గుదే లక్ష్మి రంగనాయకమ్మ, గణపతి సూర్జ్యం, బచ్చు మణి కంఠ, కొత్తూరి లక్ష్మీనారాయణ, వీరిశెట్టి వెంకట నరసింహారావు, కనుమూరి రామిరెడ్డి, కొంకితల ఆంజనేయ ప్రసాద్, కొలుసు నరేంద్ర, గుమ్మడి నాగేంద్ర, గుడివాడ ఆర్డిఓ జి శ్రీను కుమార్ తదితరులు పాల్గొన్నారు.