విద్యార్ధులపై జగన్ రెడ్డి లాఠీచార్జ్ చేయించడాన్ని ఖండిస్తున్నాం

– విద్యార్ధినులపై దాడులు చేయించిన జగన్ రెడ్డిపై ఫోక్సో చట్టం కింద కేసు పెట్టాలి
– టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మానం ప్రణవ్ గోపాల్
అనంతపురం ఎస్.ఎస్.బి.ఎన్ కళాశాలలో ఎయిడెడ్కుి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జగన్ రెడ్డి లాఠీచార్జ్ చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులను విద్యార్ధినులపై విచక్షణా రహితంగా దాడి చేయడం హేయం. విద్యార్దులపై పడిన ఒక్కో లాఠీ దెబ్బ జగన్ రెడ్డి ప్రభుత్వానికి దగ్గర పడుతున్న గడియలుగా లెక్కవేసుకోవాలి. ప్రతిపక్షాల మీదకు పోలీసులను ఉసిగొల్పినట్లుగానే తమ విద్యా సంస్థలను కాపాడుకునేందుకు శాంతి యుతంగా పోరాడుతున్న విద్యార్ధులపై లాఠీలు ఝులిపిస్తున్నారు.
ఇప్పటికే జగన్ రెడ్డి తుగ్లక్ విధానాలతో విద్యా వ్యవస్థను నాశనం చేశారు. నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం దేశంలోనే 19వ స్థానానికి పడిపోయింది. విద్యార్ధులను, విద్యాలయాలను అడ్డం పెట్టుకొని దోపిడీలకు తెగపడుతున్నారు. సామాన్యలను మోసం చేసినట్లుగా విద్యార్ధులను మోసం చేస్తే చెల్లదు. ప్రభుత్వాలనే కూలదోసిన చరిత్ర విద్యార్ధులకు ఉంది. జగన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని విద్యార్ధులు తెలుసుకొని ప్రశ్నిస్తున్నారన్న కక్షతో విద్యార్ధులపై దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
విద్యార్ధినులపై దాడులు చేయించిన జగన్ రెడ్డిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి. ఎయిడెడ్ భూములను దోచుకోవాలనుకున్న మీ దుర్భుద్దితో 2 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్ ప్రశ్నార్ధకం కానుంది. ఇప్పటికైనా జగన్ రెడ్డి ఎయిడెడ్ పై తుగ్లక్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.