Suryaa.co.in

Andhra Pradesh

రాయచోటి సీఐపై దాడిని ఖండిస్తున్నాం

– గతంలో పోలీసులు రౌడీలను కొట్టేవారు, ఇప్పుడు రౌడీలే పోలీసులను కొడుతున్నారు
– చేతులు ముడుచుకు కూర్చున్న రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం స్పందించాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

రాయచోటి సీఐపై దాడిని ఖండిస్తున్నామని, వారికి అండగా నిలిచినవారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు క్లుప్తంగా మీ కోసం…

రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది
రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. పాలు పోసి పెంచిన పాము, వారినే కాటేసినట్లు పోలీసుల దుస్థితి ఉంది. గతంలో పోలీసులు రౌడీలను కొట్టేవారు, ఇప్పుడు రౌడీలే పోలీసులను కొడుతున్నారు. రాయచోటి ఇన్స్ పెక్టర్ అనిల్‌ని వైసీపీ నాయకులు చితకబాదితే రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఏం చేస్తోంది? గతంలో ప్రతిపక్షాలమీద మీసం మెలేసి తొడగొట్టిన అసోసియేషన్, ప్రస్తుతం పోలీసులనే కొడుతుంటే ఏంచేస్తోంది? అధికార పార్టీవారితో గొడవలెందుకని సీఐ అనిల్ ని పోలీసు పైఅధికారులు సర్ది చెప్పడం అమానుషం, బాధాకరం. ఆ పైఅధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. సీఐకి కొడుతున్నారని, రక్షించండని సీఐ అనిల్ భార్య శ్వేత 100 నెంబర్ కు ఫోన్ చేసి సహాయమడగడం ఈ ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. ఈ విషయంపై సీఎం, హోంమంత్రి సమాధానం చెప్పాలి. పోలీసులకే రక్షణ లేకపోతే ఇక రాష్ట్రంలో సామాన్యులకు రక్షణేది?

వైసీపీ దాడుల్లో సామాన్య ప్రజలే కాదు పోలీసులు కూడా బాధితులే
వైసీపీ దాడుల్లో సామాన్య ప్రజలే కాదు పోలీసులు కూడా బాధితులే. రాయచోటి సీఐ అనిల్ కుమార్ పై దాడి ని ఖండిస్తున్నాం.. దాడిచేసిన దుండగులు, వారికి అండగా నిలిచిన అధికారులపై వెంటనే తప్పక చర్యలు తీసుకోవాలి. వైసీపీ గూండాల దాడి నుంచి తమను ఎవరు కాపాడుతారని కడప ప్రజలు మదనపడుతున్నారు. కడప జిల్లా రాయచోటి సీఐ అనిల్ కుమార్ ను వైసీపీ నాయకులు తన్ని, తరిమి కొట్టడం అతి దారుణం. వైసీపీ నాయకులు సీఐని అతి దారుణంగా కాళ్లు, చేతులతో చితకబాదడం అమానుషం.

కృష్ణలంక పీఎస్ లో వైసీపీ నాయకుడు హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ను కొడితే దిక్కులేకుండా పోయింది. వట్టిచెరుకూరు ఎస్ ఐని సినిమా స్టయిల్ లో చుట్టుముట్టి కొడితే రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఏం చేసింది? హిందూపురం టు టౌన్ పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ ను కొట్టినా కాపాడేవారు లేకపోయారు. పెన్నా నది నుంచి ఇసుకను తరలిస్తుంటే అదుపు చేయడానికి వెళ్లిన సిఐ పై దాడి జరిగితే పోలీసు అధికారుల సంఘం చేతులు ముడుచుకు కూర్చుంది. పల్నాడులో ఓ కానిస్టేబుల్ కు రక్తం కారేలా ముక్కు పగులగొట్టినా చర్యలు లేవు. అవుకు పోలీసులు నిందితులను అరెస్టు చేస్తే, ధర్మవరం నుంచి కొందరు వచ్చి పోలీసు స్టేషన్ పై దాడి చేసి నిందితుడిని తీసుకెళ్లిపోతే చర్యలు మాత్రం అంతంత మాత్రమే.

విశాఖజిల్లా, మూకవరపాడులో అర్థరాత్రి వీరంగం సృష్టించిన బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ బంధువులను పోలీసులు ఆపి ప్రశ్నించినందుకు ఎంపీ, అతని అనుచరులు కలిసి ఎస్ఐ, కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. తిరుపతి, సూళ్లూరు పేట ఎస్‌ఐ రవిబాబు రికార్డుల్లో రౌడీ షీటర్లుగా ఉన్నవారిని స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అందులో భాగంగా రౌడీ షీటర్ అయిన మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు కళత్తూరు సునీల్ రెడ్డిని కూడా పిలిపించినందుకు అధికార పార్టీ నాయకుడు అయిన తనను ఇతర రౌడీ షీటర్ల తరహాలో పరిగణించడంతో సునీల్ రెడ్డి రెచ్చిపోయి ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగి దాడి చేశాడు. శ్రీ సత్యసాయి జిల్లా, ముళ్లమోతుకపల్లిలో అకారణంగా వేణుగోపాల్ రెడ్డి అనే కానిస్టేబుల్ పై వైస్ ఎంపీపీ వేదవతి భర్త నరసింహరెడ్డి అలియాస్ చంటి చేయిచేసుకున్నాడు.

నందిగామలో టీడీపీ అధినేత రోడ్ షో నిర్వహిస్తుండగా వైసీపీ మూకల రాళ్ల దాడిలో ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుకి గాయాలయ్యాయి. సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐ-ప్యాక్‌ కుట్రలో భాగంగానే యర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేయించాడు దాడిలో ఎన్‌ఎస్జీ కమాండో కు గాయాలయ్యాయి. పెనుకొండ సర్కిల్‌లోని కేసులో భాగంగా ఓ పోలీసుస్టేషన్‌కు అధికారపార్టీకి చెందిన నాయకులను తీసకొచ్చారు. ఈ విషయం తెలుసుకుని కొందరు వైసీపీ పార్టీ అధికారులు స్టేషన్‌లో ఉన్న కానిస్టేబుల్ పై దాడిచేశారు. విషయం బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు.

సోషల్ మీడియాలో జడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మీపై అసభ్యకర పోస్టులు పెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికార పార్టీకి చెందిన యూట్యూబర్ సుధాకర్ రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న సమయంలో పోలీసు వాహనాన్ని వెంబడించి ఎస్సైని కొట్టుకుంటూ అవుకు నుంచి ధర్మవరం వరకు తీసుకొచ్చారు. రాజేంద్రనాథ్ రెడ్డి తన డీజీపీ స్థాయిని కేవలం నేమ్ ప్లేట్ కు మాత్రమే పరిమితం చేసి ఆత్మవంచన చేసుకుని డ్యూటీ చేస్తున్నారనే విషయం ప్రతిపక్షంగా మేము కాదు…యావత్ పోలీసు శాఖ బహిరంగంగానే మాట్లాడుకుంటోంది. ఇలా సమాన్య ప్రజలకే కాదు పోలీసులకు సైతం వైసీపీ నాయకుల దాడులు, విధింపులు తప్పడంలేదు.

తప్పు చేసినవారు పోలీసులకు భయపడతారుగానీ వైసీపీ నాయకులు మాత్రం కాదు
తప్పు చేసినవారు పోలీసులకు భయపడతారుగానీ వైసీపీ నాయకులు మాత్రం కాదు. వైసీపీ నాయకుల దయా దాక్షిణ్యాల మీద పోలీసు వ్యవస్థ నడుస్తోందనిపిస్తోంది. ఎంత పెద్ద తప్పు చేసినా పల్లెత్తి మాట అనలేని స్థితిలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఉంది. ఇందుకు పోలీసు వ్యవస్థలో ఉన్న కొందరు ఉన్నతాధికారులే కారణం. వీరు అధికారపార్టీకి తాబేదారులుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ హయాంలో కానిస్టేబుల్ కొడుకుపై దాడి జరిగితే ఊరు ఊరంతా తిరగబడిన సంఘటనలున్నాయి. సీఐపై జరిగిన దాడి లాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తప్పులు చేసినవారు ఎంతటివారైనా శిక్షిస్తామని పోలీసులు ముందుకు రావాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వివరించారు.

LEAVE A RESPONSE