అశోక్ గజపతిరాజుపై మంత్రుల దాడిని ఖండిస్తున్నాం

Spread the love

– టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు

రామతీర్ధంలో ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజుపై మంత్రుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు పేర్కొన్నారు. – బుధవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

ఆయన మాట్లాడిన మాటలు … విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే అశోకగజపతిరాజుపై, ఆయన కుటుంబంపై దాడి జరుగుతోంది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అశోకగజపతిరాజు కాలి గోటికి కూడా

సరిపోరు. అశోకగజపతి రాజు విరాళం ఇచ్చినా ప్రభుత్వ పెద్దలు స్వీకరించలేకపోవడం ప్రభుత్వ దౌర్భాగ్య స్థితికి అద్దం పడుతోంది. వెల్లంపల్లి శ్రీనివాస్ సొంత నియోజకవర్గంలోని దుర్గ గుడిలో వెండి సింహాలు మాయం అయితే మంత్రి వెల్లంపల్లి ఏమి చేస్తున్నాడు?

100 రూపాయలు కూడా దానం చేయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అశోకగజపతిరాజు పై వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లికి ప్రజల్లో తిరిగే అర్హత లేదు. మానస ట్రస్ట్ ఛైర్మన్, రామతీర్థ ఆలయ ధర్మకర్త అశోకగజపతిరాజు పట్ల జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పాలి. నిరాడంబరుడైన అశోకగజపతిరాజు కుటుంబంపై ప్రభుత్వం కక్షసాధిస్తోంది. అశోకగజపతిరాజును అవమానించడమే విజయసాయిరెడ్డి పనిగా పెట్టుకున్నారు. అందుకు సీఎం ప్రోత్సహిస్తున్నారు.

లక్షల కోట్ల విలువచేసే భూమిని దేవాలయాలకు, విద్యా సంస్థలకు దానం చేసిన ఆయన పట్ల అనుచితంగా మాట్లాడటం సబబుకాదు. గతంలో కూడా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అశోకగజపతిరాజును దుర్భాషలాడారు. వెల్లంపల్లి శ్రీనివాస్ నియోజకవర్గంలోని దుర్గ గుడి సింహాలు మాయమైతే ఆచూకీ కనపట్టలేని మంత్రి ఒక మంత్రేనా? రాముడి విగ్రహం తల తెగి కింద పడ్డా చర్యలు శూన్యం.

అశోకగజపతిరాజు దేవాలయానికి విరాళమిస్తే తీసుకోలేకపోవటం ప్రభుత్వ అసమర్థతను చాటుతోంది. సీఎం వెంటనే అశోక్ గజపతిరాజుకి జరిగిన ఘటనపై సమీక్ష జరపాలి 48 గంటల్లో సీఎం ఈ ఘటనపై స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Leave a Reply