-నాడు నిజం పాలనలో రజాకర్లు.. నేడు జాగన్ రెడ్డి పాలనలో పోలీసులు….
-మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్
నాడు నిజం పాలకులు రాజాకర్లను అడ్డంపెట్టుకుని ఏ విధంగానైతే ప్రజల ధన, మాన, ప్రాణాలను కొల్లగొట్టి భయబ్రాంతులకు గురి చేసేందో నేడు జగన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని అంతకు రెట్టింపు దారుణాలకు పాల్పడుతోంది.
- నరసరావుపేట పేట టీడీపీ ఇంచార్జి అరవిందబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల పక్షాన నిలబడటమే ఆయన చేసిన తప్పా? అందుకు పోలీసులు బూటు కాళ్లతో తంతారా? ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు తీసేలా వ్యహరిoచడం దుర్మార్గం. సొంత పార్టీ ఎంపీని పోలీసుల చేత కొట్టించటమే కాక దానిని వీడియోలో చూసి రాక్షసానందం పొందిన చరిత్ర జగన్ రెడ్డిది. తప్పు చేసిన వాళ్ల అడుగులకు మడుగులోతుతూ న్యాయం కోసం గాంధేయ మార్గంలో ఉద్యమిస్తున్న వారిపై పోలీసుల దాడి సిగ్గుచేటు. ప్రజలపై దాడులకు పాల్పడుతున్న అధికార పక్షం నాయకుల అడుగులకు మడుగులోతుతున్నారు. కొంత మంది పోలీసుల దుశ్చర్యలతో యావత్ పోలీస్ శాఖకే అవమానకరంగా ఉంటుంది.
ఇప్పటికే ఏపీ పోలీసుల మీద ప్రజలలో సగం నమ్మకం పోయింది. ఇలాంటి పనులతో ప్రజల దృష్టిలో మరింత దిగజరిపోతున్నారు. అరవింద బాబుకు ఏమన్నా జరిగితే అది పూర్తిగా పోలీసులదే బాధ్యత. జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతల్ని పోలీసుల చేత హింసిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.