-
పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవి
-
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
-
గొల్లపూడిలో 200 మంది పారిశుధ్య కార్మికులకు దుస్తులు, నిత్యావసరాలు పంపిణీ
అందరి సమిష్టి కృషితోనే ప్రకృతి విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో మహాత్మాగాంధీ హోల్ సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ మహేంద్రనగర్ వారి సౌజన్యంతో 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఆయన గురువారం దుస్తులను, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు , ఎన్డీఏ మహాకూటమి నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ వరదల సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ వారికి మహాత్మాగాంధీ హోల్ సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ తరపున దుస్తులు, నిత్యావసర వస్తువులను వితరణ గావించిన కమర్షియల్ కాంప్లెక్స్ కమీటీ సభ్యులను అభినందించారు.
ఎప్పుడూ…ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా, వరదల వల్ల నష్టపోయిన బాధితులు, అన్నదాతల కుటుంబాలను కూడా ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. వరదల్లో పూర్తిగా నష్టపోయిన ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు ఆర్థిక సాయం ప్రకటించారని వెల్లడించారు. గతంలో ఎన్నడూ చూడని విపత్తును ఎదుర్కొన్నామన్నారు.