-రైతులు క్రాప్ హాలిడే ఇస్తామంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణమో
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
ఈరోజు రైతు దినోత్సవం పెట్టే అర్హత మీకు ఎవరు ఇచ్చారు జగన్ రెడ్డి? ఈరోజు నువ్వు వైయస్సార్ ‘‘ఆత్మ క్షోభ’’ దినోత్సవంగా జరుపుకోవాలి. జగన్ రెడ్డి చేసే పనులకు, పెట్టే పేర్లకు సంబంధం ఉండదు. మీ తండ్రి గారికి కొరకరాని కొయ్యలాంటి కొడుకుగా మీరున్నారని రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. జగన్ విద్యాభ్యాసం కూడా తన తల్లిదండ్రులకు అసంతృప్తి కరంగానే ఉండేది.
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు నిన్ను బెంగళూరులోనే ఉండు.. హైదరాబాదుకు రావద్దు అన్నది నిజం కాదా? ఆనాడు కడప ఎంపీ టికెట్ కోసం మీరు గొడవపడి మీ బాబాయ్ వివేకానంద రెడ్డిని చెంప మీద కొట్టింది నిజం కాదా? మీ తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి పదవికోసం ఎమ్మెల్యేల సంతకాల సేకరణ చేసిన వ్యక్తి మీరు కాదా? మీ తల్లి విజయమ్మ గారిని గౌరవ అధ్యక్షురాలుగా పదవి నుండి అగౌరవంగా తప్పించింది నిజం కాదా?
మీ చెల్లి షర్మిల మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను జగనన్న వదిలిన బాణానంటూ రాష్ట్ర మంతా తిరిగిన అమె ఇప్పడు ఎక్కడ ఉంది? తండ్రి జయంతికి అన్నా చెల్లి కలిసి నివాళులు అర్పించలేని దుస్థితిలో ఉన్నందుకు మీనాన్న ఆత్మ క్షోభిస్తుంది కదా? దివంగతులైన మీ నాన్న గారు ‘‘నా కొడుకు జగన్’’ నా కూతురు షర్మిలను దూరం పెట్టాడు, నా తమ్ముడు వివేకా దారుణ హత్యకు గురైయ్యాడు, నా భార్యను అవమానించాడు. నా మరదలు సౌభాగ్య పుస్తెలు తెగినా తమ్ముడు కూతురు డాక్టర్ సునీత రోడ్డున పడింది. అందుకే నా అత్మ క్షోభిస్తుందని మీ నాన్నగారు. అనుకుంటున్నారు కదా?
మీ అవినీతిపై సీబీఐ పదకొండు కేసులు నమోదు చేసి , అరెస్ట్ చేసి మిమ్మల్ని 16 నెలలు చెంచల గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచింది నిజం కాదా? రాష్ట్రంలో రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయట్లేదు,రాష్ట్ర అభివృద్ధిని అంధకారంలోకి నెట్టేశారు. రైతులు క్రాప్ హాలిడే ఇస్తామంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణమో? అందుకే ఈ రోజు వైయస్ ఆత్మక్షోభ దినంగా మీరు పాటించాలని కోరుకుంటున్నాము.