– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి: మొంథా తుపానును సమిష్టి కృషితో ఎదుర్కొన్నామని టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. మూడో రోజు కూడా నియోజకవర్గంలోని ఊరూరా తిరుగుతూ బాధితులకు ఆమె భరోసానిచ్చారు. పంట పొలాలకు వెళ్లి రైతులతో మాట్లాడి జరిగిన నష్ట నివారణ చర్యలకు అవసరమైన ఆదేశాలను అధికారులకు అందజేశారు. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులకు ఓదార్పునిచ్చారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి నేనున్నానంటూ అధికారులను తీసుకువెళ్లి ప్రజలకు ఊరటగా నిలిచారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, తుపాను బీభత్సం సృష్టించినప్పటికీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్ రాత్రంతా మేల్కొని అధికారులు ఆదేశాలిస్తూ ప్రజాప్రతినిధులను, నేతలను అప్రమత్తం చేశారని తెలిపారు.
అదే స్ఫూర్తితో మన దర్శి నియోజకవర్గంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు సమిష్టిగా పనిచేసి ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచినందుకు వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు